YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

షరతులు లేని బోనస్ రైతులకు ఇవ్వాలి

షరతులు లేని బోనస్ రైతులకు ఇవ్వాలి

పార్లమెంట్ ఎన్నికల అనంతరం 500 రూపాయలు బోనస్ ఇస్తానని ప్రకటించిన సీఎంరేవంత్ రెడ్డి ఎలాంటి షరతులు లేకుండా ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి డిమాండ్ చేశారు.  పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ చౌరస్తా మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి నిరసన కార్యక్రమం చేపట్టారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్  పిలుపు మేరకు వరి ధాన్యానికి క్వింటాలుకు 500 రూపాయల బోనస్ చెల్లిస్తానని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి  ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి వంచించి మోసం చేశారని విమర్శించారు. రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి మోసం చేసిన రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేఖ విధానాలను ప్రక్కన పెట్టి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహిళలకు 2500 ఇప్పటి వరకు అమలు చేయలేదని, అన్ని అమలు అయ్యే వరకు బీఆర్ఎస్ పార్టీ ప్రజలు ,రైతులు వెంటే ఉంటదన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లు పొన్నమనేని బాలాజీ రావు, నూనెటి సంపత్, తానిపర్తి స్రవంతి  మోహన్ రావు,మహిళా నాయకురాలు దాసరి ఉషా, మండల పార్టీ అధ్యక్షులు ఐరెడ్డి వెంకట్ రెడ్డి, బైరెడ్డి రాంరెడ్డి, మార్కు లక్ష్మణ్ , జిల్లా కో ఆర్డినేటర్ కొయ్యడ సతీష్, పట్టణాధ్యక్షులు ఉప్పురాజ్ కుమార్, పాక్స్ ఛైర్మెన్ లు ,వైస్ ఎంపీపీ లు,గౌరవ కౌన్సిలర్ లు,ఎంపీటీసీ లు,మాజీ సర్పంచ్ లు, బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు.

రైతులను ఆదుకోవాలి
నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో  నేతలు ఆర్డీఓ కు వినతిపత్రం అందజేసారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రైతులు పండించిన ధాన్యం పై 500 రూపాయల బోనస్, కొనుగోలు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు.. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం ఎలక్షన్ మీద పెట్టిన దృష్టి రైతుల ధాన్యం మీద కొనుగోలు చేయడం లేదని అకాల వర్షాలతో  రాత్రి పగలు అనకుండా కష్టపడి పండించిన పంట వర్షానికి తరిసి ముద్దయిపోతుంది. కావున వెంటనే రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుండి వరి ధాన్యాలు కొనుకోవాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో టిఆర్ఎస్ పార్టీన భారీ ఎత్తున ధర్మాలు రాస్తారు అని అన్నారు

రైతులను మరచిపోయిన సీఎం రేవంత్
కాంగ్రెస్ మేనిఫెస్టోలో రైతులకు ఇచ్చిన వాగ్దానాన్ని సీఎం రేవంత్ రెడ్డి విస్మరించి  మోసం చేస్తున్నారని మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న అన్నారు.ఎన్నికలకు ముందు ప్రతీ సభలో రైతులు పండించిన వరి ధాన్యానికి 500 ల రూపాయల బోనస్ ఇస్తానని ఇప్పుడు సన్న వరి ధాన్యానికి మాత్రమే ప్రభుత్వం బొనస్ ఇస్తామని అనడం సరికాదన్నారు.బీఆర్ఎస్ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వం వైఖరిని ఖండిస్తూ గురువారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ మేరకు బాబు జగ్జీవన్ రామ్ చౌక్ వద్ద రహదారిపై వడ్లను నేలపై వేసి నిరసన వ్యక్తం చేశారు.. అనంతరం మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ రాష్ట్రంలో 80 శాతం రైతులు దొడ్డు వడ్లను పండిస్తారని,20 శాతం పండిస్తున్న సన్న వడ్లకు 500 ల బోనస్ ఇస్తామని అనడం సరికాదని,అన్ని రకాల వడ్లకు బోనస్ చెల్లిస్తామని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మాటమార్చడం పట్ల మండి పడ్డారు .దొడ్డు వడ్లు పండించిన పంటలకు కూడా 500 ల రూపాయల బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.లేని పక్షంలో బీఆర్ ఎస్ పార్టీ రైతుల పక్షాన ఉండి వారికి న్యాయం జరిగేంతవరకు పోరాటాలు చేస్తామని తెలియజేశారు.

Related Posts