YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

సంక్షేమ పథకాలక వడపోతకు శ్రీకారం

సంక్షేమ పథకాలక వడపోతకు శ్రీకారం
సంక్షేమ పథకాల అమలులో సరికొత్త వడపోతకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.  ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా క్షేత్రస్థాయిలో ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో అక్కడక్కడా బోగస్‌ లబ్ధిదారులు, అక్రమాలు తప్పడం లేదు. ఈ స్థితిలో మరింత పారదర్శకంగా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడానికి ప్రభుత్వం తాజాగా ఎస్‌ఈసీసీను ప్రజా సాధికార సర్వేతో అనుసంధానం చేస్తోంది.ఎస్‌ఈసీసీ, పీఎస్‌ఎస్‌ అనుసంధానం, ఆధార్‌ నంబర్ల నమోదు ప్రక్రియ జిల్లాలో నత్తలతో పోటీపడుతోంది. క్షేత్రస్థాయిలో రెవెన్యూ అధికారులు ఇతర పనుల్లో నిమగ్నం కావడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో 42,08,991 మందికి సంబంధించి ఎస్‌ఈసీసీ, పీఎస్‌ఎస్‌ అనుసంధాన ప్రక్రియ చేపట్టాల్సిఉంది. వీరిలో వివరాలు సరిపోలేని వారిని గుర్తించి వారి ఆధార్‌ నంబరును సేకరించి నమోదు చేయాలి. ఇప్పటి వరకు 4.20 లక్షల మందికి మాత్రమే అనుసంధానం చేశారు. మదనపల్లె, చిత్తూరు డివిజన్లతో పోలిస్తే తిరుపతి రెవెన్యూ డివిజన్‌లో అనుసంధాన ప్రక్రియ మరీ నెమ్మదిగా సాగుతోంది. చాలా మండలాల్లో ప్రారంభ దశలోనే ఉంది. జూన్‌ మొదటి వారం వరకు జరిగిన అనుసంధానం వివరాలు డివిజన్‌ వారిగా ఇలా ఉంది. 2011లో కుటుంబ ఆర్థిక స్థితిగతులను తెలుసుకోవడానికి ప్రభుత్వం కులాల వారీగా సామాజిక ఆర్థిక కుల గణన నిర్వహించింది. అనంతరం కుటుంబాల సంపూర్ణ వివరాలను తెలుసుకునేందుకు 2016లో ప్రజా సాధికార సర్వే నిర్వహించింది. తాజాగా ఈ రెంటింటిని అనుసంధానం  చేస్తోంది. అనేక కుటుంబాల వివరాలు సరిపోవడం లేదు. దీంతో వీరి వివరాలను తాజాగా వారి ఆధార్‌ నంబర్ల ఆధారంగా అనుసంధానం చేసే ప్రక్రియ ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా సాగుతోంది. ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా..  క్షేత్రస్థాయిలో సంక్షేమ కార్యక్రమాలు పక్కదారి పడుతున్నాయి. వీటిని అరికట్టడానికి ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొత్తదారులు వెతుకుతోంది. తాజాగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను నిజమైన లబ్ధిదారులకే అందించేలా.. లబ్ధిదారుల గుర్తింపు సక్రంగా జరిగేందుకు కసరత్తు చేస్తోంది. ఇందులో ప్రధానమైంది కుటుంబాల సగ్రమ సమాచారం. ఇప్పటికే ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి కార్యక్రమానికి ఆధార్‌ను ప్రామాణికంగా పరిగణిస్తోంది. అనుసంధానం వల్ల వ్యక్తి, కుటుంబ వివరాలు చాలా వరకు ప్రభుత్వం వద్ద ఉంది. తాజాగా లబ్ధిదారుడి కుటుంబ పరిస్థితిని సమగ్రంగా తెలుసుకొని.. ప్రభుత్వం అందించే పథకానికి నిజంగా అర్హుడా అని నిర్ధారించుకొనేందుకు సరికొత్తగా రెండు ప్రధాన సర్వేలను ఒకదానితో ఒకటి అనుసంధానం చేస్తోంది.ఎస్‌ఈసీసీలో కుటుంబ ఆర్థిక, సామాజిక వివరాలు సేకరిస్తే.. పీఎస్‌ఎస్‌లో కుటుంబం, వ్యక్తులు, వృత్తులు, ఆదాయం, ఇతర అంశాలను సేకరించింది. మరోవైపు ఆధార్‌తో ఇప్పటికే ఆస్తులు, వాహనాలు, ఉద్యోగుల బమోమెట్రిక్‌, బ్యాంకు ఖాతాలను అనుసంధానం చేశారు. తాజాగా ఎస్‌ఈసీసీ, పీఎస్‌ఎస్‌ను అనుసంధానం చేస్తున్నారు. ఈ అనుసంధానంలో చాలా కుటుంబాల వివరాలు సరిపోలేదు. రెండు సర్వేలో ఒకే కుటుంబానికి సంబంధించిన వివిధ అంశాలు సరిపోలేదు. తాజాగా వీరి ఆధార్‌ నంబర్లను సేకరించి అనుసంధానం చేసి సరిపోల్చుతున్నారు. ఈ ప్రక్రియ పూర్తయితే కుటుంబం, అందులోని వ్యక్తుల సమస్త సమాచారం ప్రభుత్వం వద్ద అందుబాటులో వస్తుంది.

Related Posts