YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఇంకా అదే విశ్వాసమా...

ఇంకా అదే విశ్వాసమా...

తిరుపతి, ఏప్రిల్ 29,
 వై నాట్ కుప్పం.. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో వినిపించిన మాట ఇది. కుప్పంలో చంద్రబాబును సైతం 2024లో ఓడిస్తామని గంటాపధంగా చెప్పారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు. దానికి కారణం లేకపోలేదు. స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. తెలుగుదేశం పార్టీని ఒక వ్యూహాత్మకంగా దెబ్బతీసింది. అప్పటినుంచి కుప్పం తో పాటు వై నాట్ 175 అన్న నినాదాన్ని కూడా బలంగా తీసుకెళ్లింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. అయితే స్థానిక సంస్థల గెలుపు కాదు.. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజల ఆలోచన సరళి మారుతుందని అంచనా వేయలేకపోయింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. విశ్వాసం, అతి విశ్వాసానికి మించి.. మరింత అతి చేసింది. దానికి మూల్యం చెల్లించుకుంది. ఇప్పుడు అదే కుప్పం టిడిపికి దాసోహం అవుతోంది. కుప్పంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలం నీటి బుడగగా తేలిపోయిందిమున్సిపల్ చైర్మన్ ఉప ఎన్నికల్లో టిడిపి గెలిచింది కుప్పంలో గత ఏడాది కుప్పం మున్సిపల్ చైర్మన్ గా ఉన్న సుధీర్ రాజీనామా చేశారు. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. 2021 లో జరిగిన కుప్పం మున్సిపల్ తొలి ఎన్నికల్లో వైసిపి విజయం సాధించింది. 2019లో మేజర్ పంచాయితీగా ఉన్న కుప్పంను మున్సిపాలిటీగా అప్ గ్రేడ్ చేసింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. మొత్తం 25 వార్డులకు గాను 19 చోట్ల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. దీంతో వై నాట్ 175 అన్న నినాదం తెరపైకి వచ్చింది.కుప్పం నియోజకవర్గం నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్నారు చంద్రబాబుఎప్పుడు భారీ మెజారిటీ నమోదు అవుతూ వస్తోంది. అటువంటిది 2019 ఎన్నికల్లో జగన్ ప్రభంజనంతో అమాంతం మెజారిటీ పడిపోయింది. పైగా చంద్రబాబును నిర్వీర్యం చేయడం ద్వారా రాజకీయంగా దెబ్బతీయవచ్చని జగన్మోహన్ రెడ్డి భావించారు. ఆ బాధ్యతను సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగించారు. దీంతో తన పుంగనూరు నియోజకవర్గాన్ని వదిలి ఎక్కువగా కుప్పంపై దృష్టి పెట్టారు పెద్దిరెడ్డి. అన్ని రకాల ప్రయోగాలు చేశారు. దీంతో నియోజకవర్గంలోని అన్ని పంచాయితీల్లో వైసిపి పాగా వేసింది. అంతటితో ఆగకుండా నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లోని ప్రాదేశిక ఎన్నికల్లో కూడా వైసిపి సత్తా చాటింది. తొలిసారిగా మున్సిపాలిటీగా అవతరించిన కుప్పంను కైవసం చేసుకుంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ.అయితే 2024 సాధారణ ఎన్నికలకువచ్చేసరికి ప్రజల మూడ్ మారింది. అప్పటివరకు ఉన్న పరిస్థితుల్లో పూర్తిగా మార్పు కనిపించింది. అప్పటివరకు తమ చేతుల్లో ఎన్నికలు నిర్వహిస్తూ ప్రలోభాల పర్వం నడిచింది. కానీ సాధారణ ఎన్నికల్లో తిరిగి చంద్రబాబు నాయకత్వాన్ని కుప్పం నియోజకవర్గ ప్రజలు కోరుకున్నారు. అయితే వై నాట్ కుప్పం అని సౌండ్ చేసిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సార్వత్రిక ఎన్నికల్లో దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ చేసేలా తీర్పు ఇచ్చారు కుప్పం ప్రజలు. అటు స్థానిక సంస్థల ప్రతినిధులు సైతం స్వచ్ఛందంగా టిడిపికి సరెండర్ అయ్యారు. దీంతో క్రమేపి స్థానిక సంస్థలు కూడా టిడిపి ఆధీనంలోకి వచ్చాయి.

Related Posts