YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

రేణుక ను కంట్రోల్ చేయకపోతే కాంగ్రెస్ కే నష్టమా?

రేణుక ను కంట్రోల్ చేయకపోతే కాంగ్రెస్ కే నష్టమా?

ఖమ్మం, జూన్ 12, 
రేణుకా చౌదరి సీనియర్ రాజకీయ నాయకురాలు. తెలుగుదేశం పార్టీ నుంచి ఎదిగిన ఆమె కొన్నిదశాబ్దాల నుంచి రాజకీయాల్లో కొనసాగుతున్నారు. అయితే ఆమె చేస్తున్న వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు తెచ్చి పెడుతున్నాయి. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ లో జగన్ కు అనుకూలంగా ఆమె చేస్తున్న వ్యాఖ్యలు మారుతున్నాయి. రేణుకా చౌదరి అవుట్ డేటెడ్ రాజకీయ నాయకురాలు. ఆమె ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో ఫైర్ బ్రాండ్. అది కొన్ని దశాబ్దాల క్రితం. అయితే రోజులు గడిచే కొద్దీ ఆమె ఏం మాట్లాడాలో? ఏం మాట్లాడకూడదో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. గాంధీ కుటుంబంతో ఉన్న సత్సంబంధాల కారణంగా రేణుక చౌదరి రాజ్యసభ పదవికి ఎంపికయ్యారు కానీ, లేకుంటే ఆమె రాజకీయ సన్యాసం ఎప్పుడో చేయాల్సి వచ్చేది. రేణుకా చౌదరి తానే మోనార్క్ అని భావించే వ్యక్తి. పాతకాలం నాటి రాజకీయాలు కాదు. ఖమ్మం జిల్లాలో ఆమె కాలుమోపడానికి వీలులేని పరిస్థితులున్నాయి. అక్కడ కొత్తగా ఎదిగిన నేతలు రేణుకా చౌదరిని అడుగడుగునా అడ్డుకుంటున్నారు. మల్లు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసులు రెడ్డి వంటి నేతలుండగా ఖమ్మంలో రాజకీయం చేయలేని పరిస్థితులు రేణుకా చౌదరికి ఉన్నాయి. అయితే ఆమె తరచూ ఏదో ఒక వివాదంలో ఉంటూ తాను యాక్టివ్ గానే ఉన్నాననేందుకు ప్రయత్నిస్తుంటారు. రాజ్యసభ పదవిగా ఎంపికయిన తర్వాత రేణుకా చౌదరి ఖమ్మంలో పర్యటించింది కూడా చాలా తక్కువ అనే చెప్పాలి. ఆమె వర్గాలను ప్రోత్సహిస్తుందని, పార్టీకి ఇబ్బందులు కలిగిస్తుందని సొంత పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు. తెలంగాణ రాజకీయాలు చేస్తూ తరచూ రేణుకా చౌదరి ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ లోనూ వేలు పెడుతుంటారు. అది అనవసర జోక్యం అని ఆమెకు తెలుసు. జగన్ పై చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే తెలంగాణలో కాంగ్రెస్ కు అండగా ఉన్న రెడ్డి సామాజికవర్గం ఓటర్లు ఆమెపై ఆగ్రహంతో ఉన్నారు. రేణుకా చౌదరి ఏపీ మాజీ సీఎం జగన్ పై వ్యాఖ్యలు చేసినప్పటికీ ఆ మాటల ఎఫెక్ట్ తెలంగాణ కాంగ్రెస్ పై పడే అవకాశముంది. రేణుకా చౌదరి మాట్లాడిన మాటలు కేవలం జగన్ కు వ్యక్తిగతంగానే కాదు ఏపీలోనూ వైసీపీకి కొంత లాభం చేకూర్చేవిగా ఉన్నాయి. టీడీపీకి సాయం చేయాలన్న ఆలోచనతో ఆమె చేస్తున్న కామెంట్స్ చివరకు చేటు తెచ్చే విధంగా తయారవుతున్నాయని, మొన్నటి ఎన్నికల్లో దూరమైన వర్గాలను కూడా రేణుకా చౌదరి తన మాటలతో జగన్ కు దగ్గర చేస్తున్నారన్న విశ్లేషణలు అయితే బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పిటికైనా రేణుకా చౌదరిని కాంగ్రెస్ నాయకత్వం కట్టడి చేయకపోతే పార్టీ తెలంగాణలో నష్టపోయే అవకాశముందని కొందరు కాంగ్రెస్ నేతలు హైకమాండ్ కు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.

Related Posts