
హైదరాబాద్
గచ్చిబౌలి పోలీసులు సినీనటి కల్పికపై కేసు నమోదు చేసారు. 324(4),352,351(2) బిఎన్ఎస్ ఆక్ట్ ప్రకారంగా కేసులు నమోదు చేసారు. గత నెల 29న ప్రిజం పబ్ లో బిల్ పే చేయకుండా సిబ్బంది పట్ల కల్పిత అసభ్యంగా ప్రవర్తించింది. ప్లేట్స్ విసిరేయడం, సిబ్బందిని బాడీ షేమింగ్ చేయడం, బూతు పురాణాలు తిట్టినందుకు ప్రిజం పబ్ యాజమాన్యం ఫిర్యాదు చేసింది. పోలీసుల సమక్షంలోనే హంగామా సృష్టించింది అంటూ ఫిర్యాదు చేసింది