
అనంతపురం
తాడిపత్రిలో మరోసారి హై టెన్షన్ వాతావరణం నెలకొంది. మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి తాడిపత్రి కి రావడానికి సిద్ధమైయారు. అయనను అడ్డుకోవడానికి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి,టిడిపి నాయకులు,జెసి అనుచరులు సిద్దమయ్యారు,. ఈ నేపధ్యంలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి వద్దకు టిడిపి నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి తాడిపత్రికి రాకుండా తిమ్మంపల్లి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. నోటీసులు ఇవ్వాలని పెద్దారెడ్డి రోడ్డు పైనే బైఠాయించారు.