YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

సైకిల్ యాత్రలు, ధర్నాలు : సీఎం చంద్రబాబు

సైకిల్ యాత్రలు, ధర్నాలు : సీఎం చంద్రబాబు
నాలుగేళ్లలో చరిత్రలో నిలిచిపోయే పనులు చేశాం. పార్టీ నాయకులు అంతా ప్రజల్లోనే ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. మంగళవారం జరిగిన టిడిపి సమన్వయ కమిటీ సమావేశంలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశనం చేసారు. కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఆందోళనలు, బైక్ ర్యాలీలు చేయాలని అన్నారు. బుధవారం నాడు సైకిల్ యాత్రలు, గురువారం ధర్నాలు చేయాలన్నారు. 28న ఢిల్లిలో ఎంపీల పోరాటానికి మద్దతుగా రాష్ట్రంలోనూ ధర్నాలు నిర్వహించాలన్నారు. పైసా అవినీతి లేకుండా పింఛన్లు, బీమా, పెళ్లికానుక, ఫీజులు చెల్లిస్తున్నాం.  పోలవరానికి రూ.10వేల కోట్లు ఇవ్వాలని కేంద్రానికి లేఖ రాశాం. పోలవరానికి ఇంకా రూ.1950కోట్లు కేంద్రం ఇవ్వాలి. పైసా కూడా కేంద్రం ఇవ్వాల్సిన పనిలేదని కన్నా లక్ష్మీనారాయణ అంటున్నారు. రుజువులు ఉన్నాయని అంటున్నారు. మొన్నటిదాకా కాంగ్రెస్ లో ఉండి  ఆ పార్టీని ముంచారు. ఇప్పుడు బిజెపిలో చేరి ఆ పార్టీని ముంచుతున్నారని అయన విమర్శించారు. వీళ్ల వల్ల రాష్ట్రానికి కీడే తప్ప మేలు జరగలేదు. బిజెపి, వైసిపి దొంగాట ఆడుతున్నాయి. లాలూచీ రాజకీయాలు చేస్తున్నాయి. పోరాడకుండా పారిపోవడానికే వైసిపి ఎంపిల రాజీడ్రామాలు. వారి రాజీనామాల వల్ల ఒనగూడింది శూన్యం.  ప్రయోజన రహితమైన రాజీనామాల వల్ల సాధించింది ఏమీలేదని అన్నారు. అవినీతిపరులను నియంత్రించలేని నిస్సహాయ స్థితిలో కేంద్రంలో బిజెపి నేతలు ఉన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తులు స్వాధీనం చేసుకుని వేలం వేస్తున్నాం, బాధితులకు న్యాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ఏసిబి దాడుల్లో పట్టుబడ్డ అవినీతి అధికారుల ఆస్తులు జప్తు చేశామని అన్నారు. రెడ్ శాండల్ స్మగ్లర్ల ఆస్తులు కూడా వేలం వేసేందుకు కసరత్తు జరుగుతోంది. అలాంటిది కేంద్రంలోని బిజెపి నేతలు మాత్రం అవినీతిపరులతో అంటకాగుతోంది.  గాలి జనార్ధన్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవినీతి ఆస్తుల వేలం వేయడానికి వెనుకంజ వేస్తున్నారని ఆరోపించారు. కర్ణాటకలో గాలి జనార్దన్ రెడ్డి సోదరులు, అనుచరులకు 9 సీట్లు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డికి అండదండలు ఇస్తున్నారు. అక్కడ గాలి జనార్దన్ రెడ్డి, ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డితో బిజెపి కలిసి నడుస్తోంది. గాలి జనార్దన్, బిజెపి, వైఎస్ జగన్ లాలూచీలను ఎండగట్టాలని సూచించారు. కుట్ర రాజకీయాలకు వ్యతిరేకంగా 29న కాకినాడలో ధర్మపోరాటం విజయవంతం చేయాలని అన్నారు. 

Related Posts