YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

సినిమా

పవన్ కళ్యాణ్ తంత్రం లేని సేనాని..

పవన్ కళ్యాణ్ తంత్రం లేని సేనాని..

-  పవన్ కల్యాణ్ చేపట్టిన రాజకీయ యాత్రపై కత్తి మహేశ్ అనుమానాలు

సినీ విశ్లేషకుడు కత్తి మహేశ్‌కు, పవన్ అభిమానులకు మధ్య జరిగిన రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ వివాదంపై తీవ్రంగా చర్చ జరిగింది. ఇటీవలే కత్తికి, పవన్ ఫ్యాన్స్‌కు మధ్య సయోధ్య కుదిరింది. పవన్ అభిమానులు, కత్తి మహేశ్ కలిసి నవ్వుతూ సెల్ఫీలు దిగారు. పవన్ ఫ్యాన్స్ సన్మానం కూడా చేశారు. ఈ పరిణామాలతో ఈ వివాదం సమసిపోయిందని అంతా అనుకున్నారు. కానీ మళ్లీ మొదలయ్యేలా కనిపిస్తోంది. కత్తి మహేశ్ చేసిన ట్వీట్సే దీనికి కారణం. పవన్ కల్యాణ్ చేపట్టిన రాజకీయ యాత్రపై కత్తి మహేశ్ ట్విట్టర్ సాక్షిగా అనేక అనుమానాలు వ్యక్తం చేశాడు. కత్తి మహేశ్ చేసిన ట్వీట్స్‌ యథాతథంగా..

చంద్రబాబు క్రియాశీలక రాజకీయాలలో ఉన్నంతవరకు, జనసేన పార్టీని ఒక బలమైన  ఒక బలమైన ప్రత్యామ్నాయంగా ప్రాజెక్ట్  చేయకపోవడమే పవన్ కళ్యాణ్ రాజనీతి అయితే, ఆలోచించాలసిందే! తంత్రం లేని సేనాని. యుద్ధం లేని సైన్యం. సమస్య ఇంకా బేసిక్ లెవెల్ లోనే ఉంది. ఇప్పటికీ ఆలస్యం కాలేదు. ఎదో ఒకటి చెయ్యొచ్చు. కరువు యాత్ర దాటి పచ్చటి పొలాలవైపు వచ్చేలోగా ఎంతోకొంత మార్చొచ్చు.

Related Posts