YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

తొమ్మిదో రోజుకు చేరిన సీఎం రమేష్ నిరాహారదీక్ష

తొమ్మిదో రోజుకు చేరిన సీఎం రమేష్ నిరాహారదీక్ష
కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ సాధన కోసం రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ చేపట్టిన అమరణ నిరాహారదీక్ష గురువారంలో తొమ్మిదో రోజుకు చేరింది. ఉదయం ఆయనకు రిమ్స్ వైద్యులు, అమెరికా నుంచి వచ్చిన డాక్టర్ రాజా నేతృత్వంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈసీజీ కూడా తీశారు. చక్కెర స్థాయి, బీపీ బాగా పడిపోయాయని వైద్యులు వెల్లడించారు. రిమ్స్ వైద్యుల నివేదికను పరిశీలించిన యూఎస్ డాక్టర్ రాజా ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం రమేష్ ఈ పరిస్థితుల్లో ఐసీయూలో ఉండాల్సిందని... టెంట్‌ కింద వైద్య పరీక్షలు నిర్వహించడం ఏంటని ప్రశ్నించారు. ఆయన గుండెకు కూడా ప్రమాదం ఏర్పడే అవకాశం ఉన్నందున ఏదైనా జరిగితే ఇక్కడ వైద్య సదుపాయాలు కూడా అందుబాటులో లేవని ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో వైద్య బృందాన్ని దీక్షా శిబిరం వద్దనే ఉంచుతున్నట్లు రిమ్స్ సూపరింటెండెంట్‌ గిరిధర్ తెలిపారు.కాగాఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సీఎం రమేశ్‌ను ఆంధ్రప్రదేశ్‌ పురపాలక శాఖ మంత్రి నారాయణ పరామర్శించి సంఘీభావం ప్రకటించారు. రమేశ్‌ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

Related Posts