YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

బిగ్ బాస్ కు ఎన్టీఆర్!

బిగ్ బాస్ కు ఎన్టీఆర్!

బిగ్ బాస్ టూలో.. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్.. ఎంట్రీ ఇవ్వబోతున్నారా? వైల్డ్ కార్డ్ ఎంట్రీతో కొత్త కంటెస్టంట్ గా రానున్నారా? అంటే.. రావచ్చొన్న కామెంట్సే వినిపిస్తున్నాయి. స్టార్ అట్రాక్షన్ లేక వెలవెలబోతున్న బిగ్ బాస్ ను.. షైన్ చేసేందుకు నిర్వాహకులు.. పాట్లు పడుతున్నారని టాక్. ఈ నేపథ్యంలోనే బిగ్ హౌజ్ లోకి తారక్ ను తీసుకొచ్చేందుకు ట్రై చేస్తున్నారన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. నాని హోస్ట్ గా వ్యహరిస్తున్న బిగ్ బాస్ 2 షో విజయవంతంగానే సాగుతోంది. అయితే నిర్వాహకులు ఆశించినంత రేంజ్ లో మాత్రం లేదు. హౌజ్ లోకి 16 మంది సభ్యులు కంటెస్టెంట్స్ గా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లారు. వారిలో సంజన, నూతన్ నాయుడు ఇప్పటికే ఎలిమినేట్ అయ్యారు. రోజురోజుకూ రేటింగ్ పెరుగుతుందని భావించినా.. ఈ ఇష్యూలో షో కాస్త నెమ్మదిగానే కదులుతోంది. దీంతో.. బిగ్ బాస్ పాపులార్టీయే కాక.. ఉత్సాహాన్నీ పెంచేందుకు జూనియర్ ను ట్రై చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది.
  
బిగ్ బాస్ ఫస్ట్ సీజన్ సృష్టించిన జోష్ అంతాఇంతా కాదు. ఎన్టీఆర్ హోస్ట్ కావడంతో ఈ ప్రోగ్రామ్ కు ఎక్కడాలేని ప్రజాదరణ దక్కింది. ఎన్టీఆర్ కొత్త సినిమాలతో సీజన్ టూకు అందుబాటులో లేకుండాపోయారు. దీంతో నిర్వాహకులు నేచురల్ స్టార్ నానికి ఛాన్స్ ఇచ్చారు. బిగ్ బాస్ ను నాని లీడ్ చేస్తారని తేలగానే.. కొందరు స్వాగతించినా.. మరికొందరు పెదవి విరిచారు. ఎన్టీఆర్ లా నాని ఆకట్టుకోలేరని భావించారు. ఇక ఫస్ట్ ఎలిమినేట్ అయిన సంజనా అయితే.. ఎన్టీఆర్ ను ఐఫోన్ అని.. నానిని చైనా ఫోన్ అని కామెంట్ చేసింది. ఏదైతేనేం.. సీజన్ టూలో మిస్ అయిన మెరుపులు.. అతి త్వరలోనే.. ఎన్టీఆర్ రూపంలో బిగ్ బాస్ ను ముంచెత్తనున్నాయన్న టాక్ జోరందుకుంది. తాజా సమాచారం ప్రకారం ఎన్టీఆర్ బిగ్ బాస్ హౌస్ లోకి సడన్ విజిట్ చేయబోతున్నాడని అంటున్నారు. గెస్ట్ గా ఎన్టీఆర్ ఏక్షణానైనా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. రేటింగ్ పెంచడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగమే ఇది అని అంటున్నారు. ఎన్టీఆర్ ఎప్పుడు గెస్ట్ గా బిగ్ బాస్ హౌస్ లోకి వెళతాడనేది ఇప్పటికైతే సీక్రెట్ గానే ఉంది.  

Related Posts