YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కొత్త డీజీపీగా ఠాకూర్..

కొత్త డీజీపీగా ఠాకూర్..
ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా ఆర్పీ ఠాకూర్ నియమితులయ్యారు.. ప్రస్తుతం ఏసీబీ డీజీగా ఉన్న ఆర్పీ ఠాకూర్ ను రాష్ట్ర డీజీపీగా నియమిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. డీజీపీ పదవికి గౌతమ్ సవాంగ్ నుంచి గట్టి పోటీ ఎదురైనప్పటికీ, చంద్రబాబు ఆర్పీ ఠాకూర్ వైపే మొగ్గు చూపారని సమాచారం. 1986 బ్యాచ్ కి చెందిన ఐపీఎస్ అధికారి ఠాకూర్, పూర్తి పేరు రామ్ ప్రవేశ్  ఠాకూర్. 1961 జూలై 01 న జన్మించిన ఠాకూర్ ఐఐటీ  కాన్పూర్ లో  సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ చదివారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పలు ప్రాంతాల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. హైదరాబాద్ లోని జాతీయ పోలీసు అకాడమిలో  అదనపు ఎస్పీగా తొలి నియామకం జరిగింది. తరువాత గుంటూరు, వరంగల్  జిల్లాల్లో ఎస్పీగా గా బాధ్యతలు నిర్వహించారు. పశ్చిమగోదావరి, కడప, కృష్ణా, వరంగల్ జిల్లాల ఎస్పీలుగా బాధ్యతలు నిర్వహించారు. తరువాత జోనల్ హైదరాబాద్ డీసీపీ గా , అనంతపురం, చిత్తూరు జిల్లాల డీఐజీగా పనిచేసారు. కేంద్ర సర్వీసులో భాగంగా పాట్నా  లోని ఈస్ట్రన్ జోన్ హెడ్ క్వాటర్స్ (సీఐఎస్ ఎఫ్  డీఐజీ గా పని చేసారు. ఐజీగా పదోన్నతి పొంది హైదరాబాద్ లోని డ్రగ్స్ అండ్ కాపీ రైట్స్ డీజీ, ఏడీజీగా  ఉమ్మడి రాష్ట్రంలో కంట్రోలర్ ఆఫ్ లీగల్ మెట్రాలజీ అధిపతిగా బాధ్యతలు నిర్వహించారు. రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంధ్ర విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ డీజీ, ఏడీజీ (లా అండ్ ఆర్డర్),  2016 నవంబర్ 19 నుంచి రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ డీజీగా పని చేసారు. 2003 లో ఇండియన్ పోలీసు మెడల్, 2004 లో ఏఎస్ఎస్పీ మెడల్  సాధించిన ఠాకూర్, పోలీసు శాఖలో విశిష్ట సేవలకు గుర్తింపుగా 2011 లో  భారత రాష్ట్ర పతి చేతుల మీదుగా మెడల్ పొందారు. 

Related Posts