YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

2 కోట్లతో షకలక శంకర్ టాప్

2 కోట్లతో షకలక శంకర్ టాప్

హాస్యనటుడు షకలక శంకర్ తొలిసారి హీరోగా నటించిన చిత్రం ‘శంభో శంకర’. ఈ సినిమా ద్వారా శంకర్ స్నేహితుడు ఎన్.శ్రీధర్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఆర్.ఆర్.పిక్చర్స్, ఎస్.కె.పిక్చర్స్ స‌మ‌ర్పణ‌లో వై.ర‌మ‌ణారెడ్డి, సురేష్ కొండేటి సంయుక్తంగా నిర్మించారు. శుక్రవారం విడుదలైన ఈ సినిమా నెగిటివ్ టాక్‌ను మూట గట్టుకుంది. సినిమా అస్సలు బాగాలేదని రివ్యూలు చెబుతున్నాయి. విడుదలకు ముందు శంకర్ చెప్పిన మాటలకు, సినిమాకు అస్సలు సంబంధం లేనట్టుగా విమర్శకులు తమ రివ్యూల్లో పేర్కొన్నారు. అయితే సినిమా విడుదలకు ముందు శంకర్ మాట్లాడిన ఆ మాటలే ‘శంభో శంకర’కు హైప్‌ను తీసుకొచ్చాయి. ‘త్రివిక్రమ్ దగ్గరకు వెళ్లా, దిల్ రాజు ఈ సినిమా తీయమని అడిగా’ అంటూ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో శంకర్ చెలరేగిపోయాడు. ‘వాళ్లంతా కథ బాగుంది తీద్దాం అన్నారు కానీ నన్ను హీరోగా అంటే వెనకడుగు వేశారు’ అంటూ శంకర్ చెప్పుకొచ్చాడు. ఈ మాటలు సినిమా ఓపెనింగ్స్‌కు సహకరించాయి. రివ్యూలు ఎలా ఉన్నా ‘శంభో శంకర’ తొలిరోజు రూ.2 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. మొత్తం 585 థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం రూ.2,05,18,125 వసూలు చేసింది. ఈ విషయాన్ని స్వయంగా నిర్మాతలే ప్రకటించారు. ఈ మేరకు ఒక పోస్టర్‌ను కూడా శనివారం విడుదల చేశారు. వాస్తవానికి హిట్ టాక్ తెచ్చుకున్న ‘ఈ నగరానికి ఏమైంది?’ సినిమాకు కూడా ఈ రేంజ్‌లో ఓపెనింగ్స్ రాలేదు. అసలు ఈ సినిమా ఏమిటి..? ఈ మధ్య విడుదలైన స్టార్ హీరోల చిత్రాలు ‘ఆఫీసర్’, ‘నా నువ్వే’తో పోల్చి చూస్తే ‘శంభో శంకర’కు వచ్చిన తొలి రోజు వసూళ్లు చాలా ఎక్కువ. మాస్‌లో శంకర్‌కు ఉన్న గుర్తింపు, పవన్ కళ్యాణ్ అభిమానులకు అతనిపై ఉన్న సానుభూతి ‘శంభో శంకర’కు బాగా కలిసొచ్చాయి. తొలి రోజు అయితే కలెక్షన్లు భారీగానే వచ్చాయి కానీ.. ఈ ఊపు ఇలా కొనసాగుతుందా అంటే డౌటే! 

Related Posts