YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

మహేశ్ 25వ మూవీ విడుదల తేదీ ఖరారు..!!

మహేశ్ 25వ మూవీ విడుదల తేదీ ఖరారు..!!

 మహేష్ బాబు ప్రస్తుతం తన 25 వ సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నాడు.  ఈ సినిమా షూటింగ్ డెహ్రాడూన్ లో జరుగుతుంది. ఈ చిత్రం మహేష్ కాలేజ్ స్టూడెంట్ గా కనిపిస్తాడని సమాచారం. ఈ చిత్రం లో కథానాయికగా పూజ హెగ్డే ని ఎంపిక చేసారు. మహేశ్ ప్రాణ స్నేహితుడిగా 'అల్లరి' నరేశ్ కనిపించనున్నాడు. సంక్రాంతి బరిలోకి ఈ మూవీ దిగే ఛాన్స్ ఉందనే వార్తలు కొన్ని రోజులుగా షికారు చేస్తున్నాయి. ఐతే ఈ సినిమాను ఏప్రిల్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్టుగా దర్శక నిర్మాతలు ప్రకటించారు.

Related Posts