YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

ఇది నన్ను చాలా బాధిస్తోంది - మెహరీన్‌..!!

ఇది నన్ను చాలా బాధిస్తోంది - మెహరీన్‌..!!

 'కృష్ణగాడి వీర ప్రేమ గాధ' చిత్రం తో తెలుగు తెరకు పరిచయం అయింది హీరోయిన్ మెహరీన్. ఆమె ప్రస్తుతం తెలుగులో వరుస సినిమాలతో దూసుకునివెళ్తుంది. ఇటీవల్ల కాలంలో టాలీవూడ్ లో సెక్స్ రాకెట్ కోసం పలు చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే టాలీవుడ్‌కి చెందిన పలువురు నటీమణుల పేర్లు బయటికి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో దక్షిణాది హీరోయిన్లను ఎయిర్‌పోర్ట్‌లో విచారిస్తున్నారు. అమెరికాకు వెళుతుంటే ఇమ్మిగ్రేషన్‌ అధికారులు తనను కూడా విచారించారని నటి మెహరీన్‌ వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే మీడియా వర్గాలు అనవసరంగా ఈ వివాదంలోకి తన పేరును ప్రస్తావిస్తున్నారని మెహరీన్‌ మండిపడ్డారు. ఆమె‌ కథానాయికగా నటించిన ‘పంతం’ సినిమా ప్రచార కార్యక్రమంలో  మీడియాతో మాట్లాడుతూ..‘ఈ వివాదంలోకి మీడియా  నా పేరును ప్రస్తావిస్తోంది.  ఇది నన్ను చాలా బాధిస్తోంది’ అని మెహరీన్‌ తెలిపారు.

Related Posts