YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వింతలు

దీర్ఘ ఆయుష్షుకు చక్కటి ఆహార నియమాలను పాటించడమే..

 దీర్ఘ ఆయుష్షుకు చక్కటి ఆహార నియమాలను పాటించడమే..

- స్పెయిన్‌కు చెందిన ప్రపంచంలో అత్యధిక వయస్కుడు 

- కన్నుమూసిన 113 ఏళ్ల పండు వయో వృద్ధుడు 

స్పెయిన్‌కు చెందిన ప్రపంచంలో అత్యధిక వయస్కుడైన 113 ఏళ్ల పండు వయో వృద్ధుడు కన్నుమూశాడు. నెలక్రితమే ఆయన 113వ జన్మదినం జరుపుకున్నారు. 1904 డిసెంబరు 13న ఫ్రాన్సిస్కో నునెజ్ ఒలివేరా జన్మించారు. మొదటి ప్రపంచ యుద్ధం మొదలైనప్పుడు ఆయన 10 సంవత్సరాల వయస్కుడు. ఆయన మరణంతో స్పెయిన్‌లోని ఆయన స్వగ్రామంలో సంతాప దినం పాటిస్తున్నారు. ఆయన జీవితకాలాన్ని పూర్తిగా ఆ గ్రామంలోనే గడిపారు. 

ఒలివెర దీర్ఘ ఆయుష్షుకు చక్కటి ఆహార నియమాలను పాటించడమే కారణం అంటున్నారు ఆయన కుటుంబీకులు. సొంత సాగుభూమిలో పండించిన కూరగాయాలను తీసుకోవడంతో పాటు, ప్రతి రోజూ ఒక గ్లాస్ రెడ్ వైన్‌ను తీసుకునేవారట. ఉదయం అల్పాహారం కింద ఆలివ్ ఆయిల్‌తో చేసిన స్పాంజ్ కేక్, గ్లాసుడు పాలు తీసుకునేవారు. చివరి రోజుల్లోనూ ఆయన విధిగా ప్రతిరోజూ వాకింగ్‌కు వెళ్లేవారు. 

Related Posts