YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

హైద్రాబాద్ ను ముంచెత్తిన వాన...

హైద్రాబాద్ ను ముంచెత్తిన వాన...
హైద్రాబాద్ నగరాన్ని వర్షం ముంచెత్తుతున్నది. గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, సనత్‌నగర్, యూసఫ్‌గూడ, అమీర్‌పేట్, ఎస్‌ఆర్‌నగర్, ఎర్రగడ్డ, కూకట్‌పల్లి, చందానగర్, మియాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్, ఖైరతాబాద్, లక్డీకాపూల్, నాంపల్లి, అబిడ్స్, కోఠి, చాదర్‌ఘాట్, మలక్‌పేట్, దిల్‌సుఖ్‌నగర్, కొత్తపేట, సరూర్‌నగర్, ఎల్బీనగర్, ఆర్టీసీక్రాస్ రోడ్, బాగ్‌లింగంపల్లి, రాంనగర్, ఓయూ, ఉప్పల్‌లో వర్షం పడుతున్నదివాతావరణ శాఖ అధికారులు హెచ్చరించినట్టుగానే భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల కురుస్తున్నాయి. ముఖ్యంగా రాజధాని హైదరాబాద్ లో రెండు రోజుల నుంచి వర్షాలు మొదలయ్యాయి. గురువారం తెల్లవారు జామున భారీ వర్షం కురిసింది. ఏకధాటిగా మూడు నుంచి నాలుగ్గంటల పాటూ ఆగకుండా కురిసింది. భారీవర్షం ధాటికి ప్రజలు ఇళ్లల్లోంచి కాలు బయటపెట్టలేకపోయారు. నగరంలో దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ వర్షపాతం నమోదైంది. ఈదురుగాలులతో మొదలైన వాన భారీ కుండపోతగా మారింది. నగరంలోని మలక్ పేట్,మూసారాంబాగ్, కోఠి, అబిడ్స్, గోషామహల్, సరూర్ నగర్, చైతన్యపురి, దిల్ సుఖ్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్, పంజాగుట్ట, మాదాపూర్, అమీర్ పేట్, కొండాపూర్, గచ్చిబౌలి, ఉప్పల్, సికింద్రాబాద్. ఇలా అన్ని ప్రాంతాలు జలమయం అయ్యాయి.పలుచోట్ల రహదారులపై వర్షపు నీరు నిలిచిపోయింది. ఆ రూట్లలో వెళ్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొటున్నారు. ఇప్పుడిప్పుడు వర్షం తగ్గుముఖం పడుతోంది. ట్రాఫిక్ పోలీసులు.మరో వైపు  ఉత్తర ఒడిశా తీరంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని విశాఖపట్టణంలోని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు ఏర్పడుతున్నాయని తెలిపింది. రేపు ఒకటి, 16న మరొకటి ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. కాగా... ఈ అల్పపీడనాల ప్రభావంతో ఒడిశా, చత్తీస్‌గఢ్‌, కోస్తా, తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ విభాగం అధికారులు తెలిపారు.

Related Posts