YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

హైద్రాబాద్ లో పచోంగ్ టౌన్ షిప్

హైద్రాబాద్ లో పచోంగ్ టౌన్ షిప్
హైద్రాబాద్ నగరంలో అత్యాధునిక రవాణా సదుపాయాలతో టౌన్‌షిప్‌లను ఏర్పాటు చే సేందుకు హెచ్‌ఎండిఎ ప్రత్యేక దృష్టి సారించింది. ఆ క్రమంలోనే విదేశాల్లో ని ఆధునిక టౌన్‌షిప్‌లను అధ్యయనం చేయాలని నిర్ణయించింది.  మలేషియాలోని పచోంగ్ టౌన్‌షిప్‌ను రవాణాధారిత టౌన్‌షిప్‌లు సందర్శించి అక్కడ పరిస్థితులను అధ్యయనం చేయాలని మంత్రి కెటిఆర్ అధికారులకు సూచించారు. గతంలో చైనా దేశానికి వెళ్ళిన అథారిటీ అధికారులు, ఈమారు మలేషియా రాజధాని కౌలాలంపూర్‌కు వెళ్తున్నారు.పచోంగ్ టౌన్‌షిప్ విస్తీర్ణం 51.71 చ.కి.మీ.లు. జనాభా 4 లక్షలు. ప్రతి చ.కి.మీ.కు 6,486.54. కౌలాలంపూర్ సిటీ హాల్, పచోంగ్ టౌన్ సెంటర్, కిన్రారా, జలన్, బండార్ పచోంగ్ జయ, పుసట్ బండార్, పుసట్ బండార్ వంటి టౌన్‌షిప్‌లున్నాయి. కిరాణా వస్తువులు లభించే పుటేరి మార్ట్, టౌన్‌పార్కు, షాపింగ్ చేసేందుకు బ్రిటిష్ బహుళజాతికి చెందిన మాల్ టెస్కో. ఐఓఐ మల్టిప్లెక్స్, గియాంట్ హైపర్ మార్కెట్, షేర్‌మార్కెట్‌కు సంబంధించి అయోన్, పచోంగ్ ప్లాజా, బ్యాంక్ ఆఫ్ చైనా, మలేషియా ఆస్థులు మౌలిక వసతులు సంస్థ అయిన ఎస్‌పి సెటియా, టిజివి సినిమా, సెటియా వాక్ మాల్, సబ్‌వే వంటి వాటితోపాటు విద్యా, వైద్య సంస్థలు అందుబాటులో ఉన్నాయి. గతంలోనే మరోమారు చైనాలోని షాంఘై నగరాన్ని సందర్శించాలని భావించినా, అప్పటి పరిస్థితులు నేపథ్యంలో ఆ పర్యటన వాయిదాపడింది. ఇప్పుడు మలేషియా వెళ్ళనున్నారు. మలేషియాలోని ‘పచోంగ్’ టౌన్‌షిప్‌లను సందర్శించి రావాలని సూచించారు. మలేషియా దేశాలకు చేరుకోనున్నారు. అక్కడ ప్రధానంగా నైట్ సఫారీ, కౌలాలంపూర్ సెంటర్‌తో పాటు కౌలాలంపూర్‌లోని పచోంగ్ అనే అత్యాధునిక టౌన్‌షిప్‌ను సందర్శించి అధ్యయనం చేయనున్నారు. ప్రధానంగా టౌన్‌షిప్ నమూనా, అక్కడ అందుబాటులో ఉన్న రవాణా పరిస్థితులు, వ్యాపార, వాణిజ్య, వినోదాత్మక కేంద్రాల ఏర్పాటు, భవన సముదాయాలు వంటి విషయాలను అధ్యయనం చేయనున్నారు. విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరంలోనూ రవాణాధారిత అభివృద్ధి(ట్రాన్సిట్ ఓరియంట్ డెవలప్‌మెంట్‌టిఓడి) చేయాలని హెచ్‌ఎండిఎ కమిషనర్ చిరంజీవులు భావిస్తున్నారు. ఈపాటికే పలు ప్రాంతాల్లో టిఓడిల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్దం చేసింది.అందుబాటు లో ఉన్న రవాణా సదుపాయాలను దృష్టిలోపెట్టుకుని మలేషియా కౌలాలంపూర్‌లోని ‘పచోంగ్’ అనే టౌన్‌షిప్ తరహాలోనే నగరంలో టిఓడిలను ఏర్పాటు చేయాలని హెచ్‌ఎండిఎ నిర్ణయించింది. ప్రధానంగా మూసాపేట్, తెల్లాపూర్, శ్రీనగర్(మహేశ్వరం)లో ప్రత్యేకంగా అత్యాధునిక సాంకేతిక, రవాణా సదుపాయాలతో కూడిన టౌన్‌షిప్‌లను నిర్మించాలని హెచ్‌ఎండిఏ ఈ పాటికే ప్రణాళికలను రూపొందించింది. ప్రయోగాత్మకంగా మూసాపేట్‌లో ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఇక్కడ అథారిటీకి చెందిన 20 ఎకరాల స్థలం ఉన్నది. ఈ ప్రదేశం నుండే మెట్రోరైలు వెళ్తుంది. బస్సు సౌకర్యమున్నది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ రవాణాధారిత అభివృద్ధి (టిఓడి)ని చేపట్టాలని కమిషనర్ చిరంజీవులు నిర్ణయానికి వచ్చారు. అలాగే, తెలాపూర్‌లో, మహేశ్వరంలో టౌన్‌షిప్‌లను ఏర్పాటు చేయాలని ఈపాటికే టెండర్ల ప్రక్రియను పూర్తిచేశారు. అయితే, కొన్ని ప్రత్యేక కారణాల వల్ల పనులు ప్రారంభం కాలేదు. త్వరలోనే ఈ పనులకు శ్రీకారం చుట్టాలనే యోచనలో ఉన్నట్టు తెలిసింది.

Related Posts