YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

నెక్స్ట్ మూవీ వీఐ ఆనంద్ తో.. మరోసారి డ్యూయల్ రోల్ చేయనున్న రవితేజ..!!

నెక్స్ట్ మూవీ వీఐ ఆనంద్ తో.. మరోసారి  డ్యూయల్ రోల్  చేయనున్న రవితేజ..!!

 రవితేజ వరుస సినిమాలతో బిజీ గా ఉన్నాడు. ప్రస్తుతం ఈ మాస్ రాజా శ్రీను వైట్ల దర్శకత్వంలో 'అమర్ అక్బర్ ఆంటోని' సినిమా చేస్తున్నాడు.  ఇప్పటికే ఈ చిత్రం చిత్రీకరణ సగం పైగా పూర్తి అయింది. తాజా గా రవితేజ తన తదుపరి సినిమాను "ఎక్కడికి పోతావ్ చిన్నవాడా" ఫేమ్ వీఐ ఆనంద్ తో చేయనున్నట్టు తెలుస్తోంది. ఇటీవల ఆయన రవితేజకి కథను వినిపించడం .. కొత్తగా ఉండటంతో రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం చేయనున్నట్టు సమాచారం. రెండు పాత్రల మధ్య చాలా వైవిధ్యం ఉంటుందనీ .. ఆ వైవిధ్యం ఆడియన్స్ ను కట్టిపడేయడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. ఇటీవల్ల రవి తేజ నుంచి వచ్చిన 'నెల టిక్కెటు', 'టచ్ చేసి చూడు' సినిమాలు అనుకున్నంత విజయం సాధించలేదు.

Related Posts