YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

నడిగర్ సంఘంతో శ్రీ రెడ్డి

నడిగర్ సంఘంతో శ్రీ రెడ్డి
తమిళ సినీ పరిశ్రమలో ప్రకంపనలు సృష్టించడానికి ప్రయత్నిస్తోన్న వివాదాస్పద నటి శ్రీరెడ్డి ఈరోజు  నడిగర్ సంఘంతో మాట్లాడటానికి వెళ్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ఫేస్‌బుక్‌లో ఒక పోస్టు పెట్టింది. ‘నడిగర్ సంఘంతో మాట్లాడటానికి వెళ్తున్నాను. నా సమస్యలను వారికి వినిపించాలని అనుకుంటున్నాను. పూర్తిగా మహిళల సమస్యలపైనే మాట్లాడతాను. నేను నాజర్ గారిని పిలిచాను. ఏం జరుగుతుందో చూడాలి. ప్రెస్ మీట్‌లో లేదంటే మీడియా ద్వారా ఎవరైనా నాపై, ఇతర మహిళలపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే చట్టమే శిక్షిస్తుంది. ఇది డొమెస్టిక్ వయోలెన్స్, ఈవ్ టీజింగ్ సెక్షన్స్ 294, 509, అఫెన్సివ్ ప్రోపగాండా యాక్ట్ 1986, ఐపీసీ సెక్షన్ 498ఎ కిందికి వస్తుంది. అనవసరంగా సమస్యలు కొనితెచ్చుకోవద్దు. నేను మాట్లాడిన విషయాలపై ఎలాంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నాను. సత్యమేవ జయతే.. జైహింద్’ అని తన పోస్టులో శ్రీరెడ్డి పేర్కొంది. 
కాస్టింగ్ కౌచ్ సంస్కృతికి వ్యతిరేకంగా పోరాడుతూ తెలుగు సినీ పరిశ్రమలోని ప్రముఖులకు నిద్రలేకుండా చేసిన శ్రీరెడ్డి.. ఇప్పుడు తమిళ ఇండస్ట్రీని టార్గెట్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఇటీవల చెన్నై చెక్కేసిన ఈ వివాదాస్పద నటి అక్కడి ప్రముఖులపై ఆరోపణలు చేసింది. అవకాశాల ఇస్తామని చెప్పి తనను వాడుకున్నారని దుమ్మెత్తి పోసింది. ఈ విషయంలో న్యాయం కోసం నడిగర్ సంఘం వద్దకు కూడా వెళ్తానని చెప్పింది. తమిళ సినీ పరిశ్రమ నుంచి ఎఆర్ మురుగుదాస్, సుందర్ సి. శ్రీకాంత్, రాఘవ లారెన్స్, సందీప్ కిషన్‌లను తనను వాడుకున్నారని ఆరోపించింది. అంతేకాకుండా త్రిష, నయనతార వంటి స్టార్ హీరోయిన్లు కూడా బయటకు వచ్చి తమకు ఎదురైన కాస్టింగ్ కౌచ్ అనుభవాల గురించి చెప్పాలని సూచించింది. అయితే దీనిపై నడిగర్ సంఘం కోశాధికారి, ప్రముఖ హీరో కార్తి స్పందిస్తూ శ్రీరెడ్డిపై ఎదురుదాడికి దిగారు. ఆమె చేసిన ఆరోపణలన్నీ నిరాధారమైనవని కొట్టిపారేశారు. ఆమె వద్ద ఆధారాలు ఉంటే పోలీసుల వద్దకు వెళ్లాలని సూచించారు. ఆధారాలు లేకుండా ఫిర్యాదు చేస్తే నడిగర్ సంఘం ఎలాంటి చర్యలు తీసుకోదని స్పష్టం చేశారు. కార్తి వ్యాఖ్యలకు శ్రీరెడ్డి కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. పనికిమాలిన మాటలు, లాజిక్కులు మాట్లాడకుండా తన బాధను అర్థం చేసుకోవాలని సూచించింది. ఇప్పుడు మీడియా ముందుకు వెళ్తోంది. అక్కడ శ్రీరెడ్డికి ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో చూడాలి. 

Related Posts