YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

జగన్ పాత్రలో తమిళ హీరో కార్తీ..??

 జగన్ పాత్రలో తమిళ హీరో కార్తీ..??

 మహి వి. రాఘవ్‌ దర్శకత్వంలో దివంగత నేత వైస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా "యాత్ర" అనే సినిమా రూపొందుతుంది. వైఎస్సార్‌ జయంతి సందర్భంగా విడుదల చేసిన టీజర్‌ ఆకట్టుకుంది. ఇప్పటికే ఈ సినిమాలో వైఎస్‌ తండ్రి రాజారెడ్డి పాత్రలో జగపతిబాబు, మాజీ హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి పాత్రలో సుహాసిని, వైఎస్‌ కుమార్తె షర్మిళ పాత్రలో భూమిక నటిస్తున్నారని వార్తలు వెలువడుతున్నాయి. అయితే వైఎస్‌ కుమారుడు జగన్‌ పాత్ర గురించి సోషల్‌మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రముఖ నటుడు కార్తి జగన్‌ పాత్రలో నటిస్తున్నట్లు టాలీవుడ్‌ వర్గాల సమాచారం. దీనిపై స్పష్టత రావాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. వచ్చే ఏడాది జనవరిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related Posts