YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

శనివారం ఒక్క రోజే లక్ష మొక్కలు

శనివారం ఒక్క రోజే లక్ష మొక్కలు
 నాలుగో విడత హరితహారం కార్యక్రమంలో ప్రతి గ్రామానికి 40 వేల మొక్కల చొప్పున నాటాలని అధికార యంత్రాంగం నిర్ణయించుకున్నది. ఇందులో భాగంగా 1.37 కోట్ల మొక్కలు నాటనున్నారు. మొక్కలు నాటేందుకు ఎప్పటిలాగే శాఖల వారీగా లక్ష్యాలను కేటాయించారు. డీఆర్‌డీఏకు 39.50 లక్షలు, ఎక్సైజ్‌కు 4 లక్షలు, పోలీసు శాఖకు 3 లక్షలు, ఎండోమెంట్‌కు 1.50 లక్షలు, కార్మిక శాఖకు 5 వేలు, విద్యుత్ సంస్థకు 30 వేలు, మైనింగ్‌కు 50 వేలు, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌కు 2 లక్షలు, ఎండోమెంట్ (సమ్మక్క గద్దెలకు) 45 వేలు, పరిశ్రమల శాఖకు 30 వేలు, రోడ్లు, భవనాల శాఖకు 50 వేలు, పంచాయతీరాజ్ కనెక్టివిటీ రోడ్లకు 2.50 లక్షలు, రైల్వేకు 30 వేలు, హార్టీకల్చర్‌కు 50 వేలు, సెరీకల్చర్‌కు 50 లక్షలు, మైనర్ ఇరిగేషన్‌కు 4 లక్షలు, మేజర్ ఇరిగేషన్‌కు లక్ష, రవాణా శాఖకు 20 వేలు, అటవీ శాఖకు లక్ష, శాతవాహన యునివర్సిటీకి 25 వేలు, ఆరోగ్య శాఖకు 50 వేలు, కేడీసీసీబీకి 8 వేలు, రాష్ట్ర గిడ్డంగుల శాఖకు 2 వేలు, కేంద్ర గిడ్డంగుల శాఖకు 2 వేలు, వక్ఫ్‌బోర్డుకు 5 వేలు, హుజూరాబాద్ నగర పంచాయతీకి 3.23 లక్షలు, జమ్మికుంట నగర పంచాయతీకి 3.23 లక్షలు, చొప్పదండి జవహర్ నవోదయ పాఠశాలకు 2 వేల మొక్కల లక్ష్యాన్ని కేటాయించారు. అయితే ప్రణాళిక ప్రకారంగా మొక్కలు నాటే బాధ్యతలను కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ అన్ని శాఖలకు అప్పగించారుశనివారం నుండి అన్ని గ్రామాల్లో లక్ష మొక్కలు నాటాలని కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. ఈ మేరకు జిల్లాలోని చిగురుమామిడిలో 4, చొప్పదండిలో 8, గంగాధరలో 4, గన్నేరువరంలో 6, హుజూరాబాద్‌లో 10, జమ్మికుంటలో 23, కరీంనగర్‌లో 5, శంకరపట్నంలో 11, మానకొండూర్‌లో 21, రామడుగులో 4, సైదాపూర్‌లో 13, తిమ్మాపూర్‌లో 20, వీణవంకలో 3 చొప్పున జిల్లాలో మొత్తం 132 ప్రదేశాల్లో లక్ష మొక్కలు నాటేందుకు అధికారులు గుర్తించి పెట్టుకున్నారు. ప్రతి గ్రామంలో 300 నుంచి 500, ప్రతి మండలంలో 5 నుంచి 7 వేల మొక్కలు నాటాలని నిర్ణయించుకున్నారు. శనివారం ఒక్కరోజే లక్ష మొక్కలు నాటుతున్నట్టు డీఆర్‌డీఓ ఏ వెంకటేశ్వర్ రావు తెలిపారు.

Related Posts