YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ప్రారంభమైన మూసి ప్రక్షాళన 12లక్షల మెట్రిక్ టన్నుల నిర్మాణ వ్యర్థాలను తొలగించనున్న జీహెచ్ఎంసీ

 ప్రారంభమైన మూసి ప్రక్షాళన  12లక్షల మెట్రిక్ టన్నుల నిర్మాణ వ్యర్థాలను తొలగించనున్న జీహెచ్ఎంసీ
మూసినది ప్రక్షాళనలో తొలి అంకమైన మూసిలోని భవన నిర్మాణ వ్యర్థాల తొలగింపు ప్రక్రియను జీహెచ్ఎంసీ ప్రారంభించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 57 కిలోమీటర్ల పొడవుతో  ఉన్న మూసిలో దాదాపు 12 లక్షల మెట్రిక్ టన్నుల భవన నిర్మాణ వ్యర్థాలు ఉన్నాయని ప్రాథమికంగా అంచనా వేశారు. మూసినదిని ప్రక్షాళనచేసి సుందరీకరించాలని రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలు జారీచేయడంతో జీహెచ్ఎంసి తనవంతుగా మూసిలోని భవన నిర్మాణ వ్యర్థాలను తొలగించే కార్యాచరణను ఖరారు చేసింది. ఇందుకుగాను తొలిదశలో 50 ట్రక్లు, పది జెసిబిలను నిర్మాణ వ్యర్థాలను తొలగించేందుకు కేటాయించింది. ఒక్కో ట్రక్ ద్వారా రోజుకు ఐదారు ట్రిప్పుల చొప్పున 50 టిప్పర్ల ద్వారా కనీసం 300 లోడ్ల నిర్మాణ వ్యర్థాలను (షుమారు 6000 టన్నులు) తరలించనున్నారు. మూసినదిపై అంబర్పేట్ రెవెన్యూ మండల పరిదిలో చాదర్ఘాట్ వహీదానగర్, తులసీనగర్, దుర్గానగర్లలోనూ హిమాయత్నగర్ మండంలోని చాదర్ఘాట్ బ్రిడ్జి సమీపంలోని సాయిబాబా గుడి వెనుక వైపు, నాంపల్లి మండలంలోని శివాజి బ్రిడ్జి, చార్మినార్ మండలంలోని దర్బార్ మైసమ్మ టెంపుల్ వెనుకవైపు, సైదాబాద్ మండలంలోని తీగలగూడ, మూసారాంబాగ్, రాజేంద్రనగర్ మండలంలోని జియాగూడ కమేలా సమీపంలో, ఉప్పల్ మండలంలోని దేవేందర్నగర్, నాగోల్ బ్రిడ్జి ఎడమ వైపు, మేడిపల్లి మండలంలోని పర్వాతాపూర్ తదితర ప్రాంతాల్లో ఉన్న మూసిలో పెద్ద ఎత్తున భవన నిర్మాణ వ్యర్థాలు ఉన్నాయని, ప్రాథమికంగా అంచనా వేశారు. ఇప్పటికే నిర్మాణ వ్యర్థాలను మూసిలో వేయకుండా మూసిపై ప్రహరీగోడ నిర్మాణం, కంచె ఏర్పాటు, నిర్మాణ వ్యర్థాలను వేసేవారిని గుర్తించి కేసులు నమోదు చేయడం, సీసీ కెమెరాల ద్వారా అక్రమంగా డెబ్రిస్ వేసేవారిని గుర్తించడం తదితర చర్యలను జీహెచ్ఎంసీ చేపట్టింది. దీనిలో భాగంగా ఇప్పటికే చెరువులు, ప్రధాన రహదారులు, నాలాల వెంట ఉన్న భవన నిర్మాణ వ్యర్థాలను జీహెచ్ఎంసీ తొలగించే ప్రక్రియను ప్రారంభించింది. దాదాపు లక్ష మెట్రిక్ టన్నుల నిర్మాణ వ్యర్థాలను తొలగించింది. తొలగించిన నిర్మాణ వ్యర్థాలను ఫతుల్లగూడ, జీడిమెట్ల, కొత్వాల్గూడలకు తరలిస్తున్నారు.

Related Posts