YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

నాలుగు రోజుల్లో కొత్త పంచాయితీలు

నాలుగు రోజుల్లో కొత్త పంచాయితీలు
రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన పంచాయతీలు మరో నాలుగు రోజుల్లో అమల్లోకి రానున్నాయి.ఆగస్టు 2 నుంచి రాష్ట్రంలో కొత్త గ్రామ పంచాయితీలు మనుగడలోకి వస్తున్న సందర్భాన్ని మంచి అవకాశంగా తీసుకుని గ్రామాలను గొప్పగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు. పల్లెసీమలే దేశానికి పట్టుగొమ్మలని, గ్రామాలు అభివృద్ది చెందితే దేశం, రాష్ట్రం బాగుపడుతుందని ఆయన అన్నారు. అన్ని గ్రామ పంచాయితీలకు స్పెషల్ ఆఫీసర్స్ వస్తున్నారని, ప్రతీ గ్రామానికి ఒక గ్రామ కార్యదర్శి ఖచ్చితంగా ఉండే విధంగా కొత్తగా నియామకాలు చేస్తున్నామని వెల్లడించారు.తెలంగాణలో ఆగస్టు 2వ తేదీ నుంచి కొత్త పంచాయితీలు అందుబాటులోకి రానున్నాయి..మనది కొత్త పంచాయతీ అంటూ ప్రజలందరికీ తెలిసేలా ఆగస్టు 2న చాటింపు ద్వారా ప్రజలకు తెలియజేయాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది. గ్రామస్థులకు అభినందనలు అంటూ పంచాయతీలో బ్యానర్లు కూడా ఆరోజు దర్శనమివ్వనున్నాయి. ఆ రోజు ఒకే సారి 4,383 కొత్త పంచాయతీలు అవిర్భవించనుండటంతో కలిపి వాటి సంఖ్య ఏకంగా 12,751కి చేరబోతుంది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను కలెక్టర్లకు రాష్ట్ర సర్కారు పంపించింది.ఆగస్టు 2 నుంచి రాష్ట్రంలో కొత్త గ్రామ పంచాయితీలు మనుగడలోకి వస్తున్న సందర్భాన్ని మంచి అవకాశంగా తీసుకుని గ్రామాలను గొప్పగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు. గ్రామాల్లో చేపట్టాల్సిన పనులను కలెక్టర్లు, రాష్ట్ర స్థాయి అధికారులు పర్యవేక్షించాలని చెప్పారు. గ్రామాల్లో తమ దృష్టికి వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించడానికి వీలుగా పంచాయితీ రాజ్ ముఖ్య కార్యదర్శి విచక్షణాధికారాల ద్వారా వినియోగించడానికి జిల్లాకు రూ.కోటి చొప్పున 30 కోట్ల రూపాయలు అందుబాటులో ఉంచనున్నారు. కొత్తగా నియామకమయ్యే గ్రామ కార్యదర్శులకు మూడేళ్లు ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. వారికి ఏఏ పనులు చేయాలనే విషయంలో మార్గదర్శనం చేస్తున్నారు. మరో వైపు కోర్టు కేసుల నేపథ్యంలో పంచాయితీ ఎన్నికలు ఆలస్యమవుతున్నాయి. ఆలోగా అభివృద్ధి పనులు కుంటుపడకుండా ఉండేందుకు స్పెషల్ అఫీసర్లను నియమిస్తున్నారు. కోర్టు తీర్పు వచ్చిన వెంటనే ఎన్నికలునిర్వహించనున్నారు.కొత్త పంచాయతీ కార్యాలయం కోసం భవనాన్ని ఎంపిక చేసి ఫర్నీచర్‌, స్టేషనరీ సిద్ధం చేయాలి. ప్రస్తుత పంచాయతీలోని స్వీపర్లు, వాటర్‌ మ్యాన్‌, ఎలక్ట్రీషియన్లు, బిల్లు కలెక్టర్లు వంటి వారు ఉన్నట్లైతే వారిని పాత, కొత్త పంచాయతీలకు విభజించాలి. పన్ను డిమాండ్‌ రిజిస్టర్‌, రివిజన్‌ రిజస్టర్‌, ఇతర చట్టపరమైన రిజస్టర్లన్నింటినీ అధికారులు స్వాధీనం చేయనున్నారు. పంచాయతీ ఆస్తులు, అప్పులను రెండు పంచాయతీల మధ్య విభజిస్తున్నారు. ప్రజలకు కావాల్సిన సేవలన్నీ ఇక అప్పటి నుంచి స్థానికంగా అందేలా చూడాలి. తపాలా శాఖ సిబ్బంది కొత్త పంచాయతీకే వచ్చి పింఛన్లు ఇచ్చేలా కలెక్టర్లు చర్యలు చేపడతారు. పంచాయతీ ఆస్తులు, అప్పులను రెండు పంచాయతీల మధ్య విభజించాలి. పంచాయతీ భౌగోళిక వివరాలను పొందుపర్చిన బోర్డును పెట్టాలి. ప్రభుత్వానికి చెందిన ఇతర ప్రయోజనాలు కూడా కొత్త పంచాయతీలోనే అందుతాయి. మరో వైపు పింఛనర్ల సమస్యల పరిష్కారానికి రాష్ట్రంలోని శాసనసభ్యులు, ఎమ్మెల్సీలకు లేఖలు రాస్తామని తెలంగాణ పింఛనర్ల ఐకాస ఛైర్మన్‌ కె. లక్ష్మయ్య తెలిపారు. పింఛనర్ల డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదని తెలిపారు. 

Related Posts