YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

హరిత హారం యజ్ఞంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి మంత్రి పద్మారావు పిలుపు

హరిత హారం యజ్ఞంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి               మంత్రి  పద్మారావు పిలుపు
జంటనగరాల్లో ప్రస్తుత విడత హరిత హారం కార్యక్రమం విజయవంతం చేయాలనీ మంత్రి పద్మారావు గౌడ్ తెలిపారు. బౌధనగర్ డివిజన్ లలితానగర్ కాలనీ పార్క్ లో నేడుహరిత హారం కార్యక్రమం కోలాహలంగా జరిగింది. కార్యక్రమంలో మంత్రి పద్మారావు ముఖ్య అతిధిగా పాల్గొని మొక్కలు నాటారు. కార్పోరేటర్స్ సామల హేమ, అలకుంట సరస్వతి, జిఎచ్ఎంసి ఉప కమీషనర్ రవికుమార్, తెరాస యువజన్ విభాగం నగర అధ్యక్షుడు అలకుంట హరి, బౌధనగర్ డివిజన్ ఇంచార్జ్ దయానంద్ గౌడ్, కంది నారాయణ, సంజీవ్ ముదిరాజ్,ఆంజనేయులు(అంజూర్)ముదిరాజ్, వార్డ్ సబ్యులు నిర్మలముదిరాజ్,సుమలత,సుజాత,బల్ల గీత నేత,మంజుల,భాగ్య, లతో పాటు  అధికారులు, నేతల, తదితరులు పాల్గొన్న కార్యక్రమoలో ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ సికింద్రాబాద్ లొని అన్ని ఖాళీ స్థలాల్లో మొక్కల పెంపకానికి ఏర్పాట్లు జరిపుతున్నామని తెలిపారు.  అన్ని మునిసిపల్ డివిసిజన్ల పరిధులలో మొక్కల పెంపకం కార్యక్రమాన్ని ముమ్మరం చేయాలనీ అధికారులను ఆదేశించారు. అన్ని డివిజన్  కార్పోరేటర్స్, పార్టీ శ్రేణులు ఈ బృహత్తర యజ్ఞంలో భాగస్వాములు కావాలని సూచించారు.  నగర వ్యాప్తంగా సైతం హరిత హారం కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలు భాగస్వామ్యం వహించేలా ఏర్పాట్లు జరుపుతున్నామని, మొక్కల పరిరక్షణకు పౌరులు కూడా సహకరించాలని కోరారు.

Related Posts