YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

డా.అబ్దుల్ కలాం స్మారకంగా మొక్కలు నాటిన జీహెచ్ఎంసీ

డా.అబ్దుల్ కలాం స్మారకంగా మొక్కలు నాటిన జీహెచ్ఎంసీ
మాజీ రాష్ట్రపతి స్వర్గీయ డా. ఏ.పి.జె అబ్దుల్ కలాం 3వ వర్థంతిని పురస్కరించుకొని కంచన్బాగ్ డి.ఆర్.డి.ఎల్లో జీహెచ్ఎంసీ నేడు పెద్ద ఎత్తున మొక్కలు నాటింది. డి.ఆర్.డి.ఎల్ డైరెక్టర్లు, జీహెచ్ఎంసీ అర్బన్ బయోడైవర్సిటీ డైరెక్టర్ దామోదర్తో పాటు డి.ఆర్.డి.ఎల్కు చెందిన 600మందికిపైగా సైంటిస్టులు, ఉద్యోగులు 800లకు పైగా మొక్కలు నాటారు. ఇదే డీ.ఆర్.డి.ఎల్లో ఉన్న ఖాళీ స్థలంలో గత రెండేళ్ల క్రితం జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నాటిన వందలాది మొక్కలు ఏపుగా పెరిగాయి. కాగా షేక్పేట్ సూర్యనగర్ కాలనీలో నిర్వహించిన హరితహారంలో ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ భారతిహోలీకేరితో పాటు సమీపంలోని వివిధ పాఠశాలలకు చెందిన మైనార్టీ విద్యార్థీనివిద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరై మొక్కలు నాటారు. తార్నాక సమీపంలోని లలితానగర్ కాలనీలో నిర్వహించిన హరితహారంలో రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి పద్మారావుతో సహా బౌద్దనగర్, సీతాఫల్ మండి, తార్నాకలకు చెందిన కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుత హరితహారం కార్యక్రమంలో నేటి వరకు 12లక్షల మొక్కలను ఉచితంగా పంపిణీ చేయడం జీహెచ్ఎంసీ ద్వారా ఖాళీ స్థలాల్లో నాటినట్టు జీహెచ్ఎంసీ ఓ ప్రకటనలో తెలిపింది.

Related Posts