YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

భారీ రేటుకు అమ్ముడైన 'సవ్యసాచి' విడుదల హక్కులు

భారీ రేటుకు అమ్ముడైన  'సవ్యసాచి' విడుదల హక్కులు

 చందూ మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా 'సవ్యసాచి' సినిమా రూపొందుతోంది. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో, మాధవన్ .. భూమిక కీలకమైన పాత్రలను పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై .. విభిన్నమైన కథాకథనాలతో ఈ సినిమా నిర్మితమవుతోంది. వీరిద్దరి కాంబినేషన్ గతం లో ప్రేమమ్ చిత్రం వచ్చింది. ఈ చిత్రం నుంచి ఒక పోస్టర్ రిలీజ్ చేసారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ  సినిమా విడుదల హక్కులు 9.5 కోట్లకు అమ్ముడైనట్టుగా సమాచారం.  ఈ సినిమాతో పాటు నాగచైతన్య 'శైలజా రెడ్డి అల్లుడు' సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఆ తరువాత శివ నిర్వాణ ప్రాజెక్టును చైతూ పట్టాలెక్కించనున్నాడు.     
 

Related Posts