YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

శుక్రవారానికి నాలుగు సినిమాలు రెడీ

 శుక్రవారానికి నాలుగు సినిమాలు రెడీ
శుక్రవారం వస్తుందంటే చాలు సినిమా అభిమానులుకు పండగ వాతావరణం నెలకొంటుంది. సంక్రాంతి పందెంకోళ్లలా సినిమాలు బాక్సాఫీస్ బరిలో దిగితాయి. ఈ వారం కూడా విభిన్న జోనర్స్ లో మూవీస్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమవుతున్నాయి. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం.ఈ వారం కూడా బరిలో స్టార్ హీరోలు లేకపోయినా యంగ్  హీరోలు తమ అదృష్టాన్ని టెస్ట్ చేసుకోబోతున్నారు. ఈ లిస్ట్ లో ముందుగా చెప్పుకోవాల్సింది సుశాంత్ హీరోగా రూపొందిన చిలసౌ మూవీ గురించి. మొదట అంచనాలు లేకుండా స్టార్ట్ అయిన ఈ మూవీ ట్రైలర్స్, టీజర్స్ తో ఒక్కసారిగా హైప్ తెచ్చుకుంది. పెళ్లి బ్యాక్ డ్రాప్ లో 24 గంటల్లో జరిగిన ప్రేమ కథగా ఈ మూవీ తెరకెక్కింది. నటుడు రాహుల్ రవీంద్రన్  ఈ సినిమాతో డైరక్టర్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అన్నపూర్ణ బ్యానర్ పై సినిమా రిలీజ్ అవుతుండటంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.  ఇక ఇంప్రెసీవ్ ట్రైలర్స్ తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నచిత్రం గూఢచారి. తెలుగులో చాలా రేర్ గా వచ్చే స్పై థ్రిల్లర్ జానర్ లో వస్తున్న ఈ మూవీ తెరకెక్కింది. అడవి శేష్ ఈ చిత్రానికి స్టోరీ అందించడం విశేషం. గతంలో అడవి శేష్  కథ, స్రీన్ ప్లే అందించిన క్షణం మంచి విజయాన్ని సాధించడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ సినిమాలో అడవి శేష్ సరసన తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ నటించింది. నూతన దర్శకుడు శశికిరణ్ టిక్కా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.మారుతీ కథందించిన బ్రాండ్ బాబు కూడా ఈ వీకెండ్ కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.  బ్రాండ్ కి మాత్రమే వాల్యూ ఇచ్చే రిచ్ కుర్రోడికి, ఓ పనిమనిషికి జరిగే లవ్ స్టోరీగా పూర్తి  స్థాయి ఎంటర్ టైన్మెంట్ జానర్ లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే మారుతీ మార్క్ ట్రైలర్స్ తో సినిమాకి మంచి బజ్ వచ్చింది. నటుడు ప్రభాకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా..ఇషా రెబ్బ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. కన్నడ హీరో సుమంత్ శైలేంద్ర ఈ సినిమాతో టాలివుడ్ కి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు
క సీనియర్ మ్యూజిక్ డైరక్టర్ చక్రవర్తి మనవడు రాజేష్ శ్రీ చక్రవర్తి కూడా శివకాశీపురం సినిమాతో తన లక్ టెస్ట్ చేసుకోబోతున్నాడు. మరి వేటికవే విభిన్న జోనర్స్ లో వస్తున్న ఈ మూవీస్ లో ఏ మూవీ ఆడియెన్స్ తో హిట్టు బొమ్మ అనిపించుకుంటుందో తెలియాలంటే రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే.

Related Posts