YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

బిగ్‌బాస్ హౌస్‌లో వివాదాస్పద వ్యాఖ్యలు.. కమల హాసన్‌పై చెన్నై కమిషనర్‌కు ఫిర్యాదు..!!

బిగ్‌బాస్ హౌస్‌లో వివాదాస్పద వ్యాఖ్యలు.. కమల హాసన్‌పై చెన్నై కమిషనర్‌కు ఫిర్యాదు..!!

 తమిళ బిగ్‌బాస్ హౌస్‌లో దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఫై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. హౌస్‌లో జయలలితను అవమానించేలా మాట్లాడారని కేసు నమోదైంది. హౌస్‌లోని పోటీదారు ఐశ్వర్య.. జయలలిత డిక్టేటర్‌గా వ్యవహరించి రాష్ట్రాన్ని పాలించారని ఆరోపించారు.  కమల్ ఆమె వ్యాఖ్యలకు వంత పలకడమే కాకుండా జయను అవమానించేలా వ్యాఖ్యలు చేశారంటూ మద్రాస్ హైకోర్టు అడ్వకేట్ లౌసీల్ రమేశ్ గ్రేటర్ చెన్నై కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. కమల్ తన రాజకీయ ప్రయోజనాలకు షోలో జయలలితను అవమానించేలా మాట్లాడుతున్నారని అందులో పేర్కొన్నారు. జయలలితపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్టుగా చెబుతున్న షో శనివారం ప్రసారం కానుంది. ఈ షో చూస్తేకానీ నిజంగా కమల్ నిజంగా జయను అవమానించేలా వ్యాఖ్యలు చేశారా? లేదంటే ప్రోమో కోసం అలా ఎడిట్ చేశారా? అనే విషయం తెలియనుంది.

Related Posts