YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

70 యేళ్ల వృద్ధురాలిగా సమంత..??

70 యేళ్ల వృద్ధురాలిగా సమంత..??

సమంత గ్లామర్ తో పాటు నటనకి ఎక్కువగా అవకాశం వుండే పాత్రలను అంగీకరిస్తూ ప్రశంసలు, విజయాలు అందుకుంటోంది. తాజాగా దర్శకురాలు నందినీ రెడ్డి దర్శకత్వంలో సమంత మరో వైవిధ్యభరితమైన కథాంశానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందనే టాక్ ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది. ఇది 2014లో వచ్చిన కొరియన్ మూవీ 'మిస్ గ్రానీ'కి రీమేక్ అని అంటున్నారు. ఈ సినిమాలో ప్రధాన పాత్రధారి 70 యేళ్ల వృద్ధురాలిగా కనిపిస్తూ ఉంటుంది. అతీత శక్తులను కలిగిన ఆమె అవసరమైనప్పుడు యవ్వనవతిగా మారిపోతూ ఉంటుంది. దీనిపై  పూర్తి సమాచారం తెలియాల్సిఉంది.

Related Posts