YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

మళ్లీ తెలుగులో శ్రియ

మళ్లీ తెలుగులో శ్రియ
  సీనియారిటీ పుచ్చుకున్నా... ఇంకా చేతినిండా సినిమాలతో సూపర్ బిజీగా ఉన్న ఆ ముదురుభామ... ఈ మధ్యనే పెళ్లి ముచ్చట కూడా కానిచ్చేసింది. అయినా.. అందాల విందులో ఏమాత్రం తగ్గనంటోంది ఆ సన్నజాజి. ఇంతకూ ఎవరా బోల్డ్ బ్యూటీ?తెలుగు నాట హీరోయిన్ గా అడుగుపెట్టి ఏళ్లు గడుస్తున్నా.. ఇంకా సన్నజాజి కాడలాగా నవనవలాడిపోతోంది శ్రియా శరణ్. ఈ మధ్యే ఫారిన్ బాయ్ ఫ్రెండ్ ను పెళ్లాడిన ఈ మెరుపుతీగ... హనీమూన్ ఫేజ్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది. అంతేకాదు... అప్పుడుప్పుడూ తన తీయని జ్ఞాపకాల్లోని కొన్ని మధురిమలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ... ఫ్యాన్స్ ను తెగ ఊరిస్తోంది అమ్మడు. ఈ మధ్య తన రష్యన్ హజ్బెండ్ తో కలసి అలా సరదాగా విదేశాల్లో చక్కర్లు కొట్టేందుకు వెళ్లిన శ్రియ... కొన్ని ఫొటోలను తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. అయితే అమ్మడు బికినీలో తన అందాలు ఆరబోయడంతో ఈ ఫొటోలు కొన్ని నిమిషాల వ్యవధిలోనే సోషల్ మీడియాలో వైరల్ అయిపోయాయి. ముఖ్యంగా అమ్మడు పింక్ కలర్ బికినీలో దిగిన పిక్స్ అయితే... హాట్ కేకుల్లా మారాయి. ఏమైనా 35 ఏళ్ల వయసులోనూ శ్రియ టీనేజ్ అమ్మాయిలా కనిపిస్తూ కవ్విస్తోంది. ప్రస్తుతం హనీమూన్ ను ఎంజాయ్ చేస్తున్న శ్రియ... త్వరలోనే మళ్లీ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో బిజీగా మారనుంది. మరి అమ్మడు ఏ రీతిన జనాలను ఆకట్టుకుంటుందో చూడాలి. 

Related Posts