YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

నవ్వుతూనే ఏడిపించిన సోనాలి..!!

 నవ్వుతూనే ఏడిపించిన సోనాలి..!!

ప్రముఖ నటి సోనాలి బింద్రే హైగ్రేడ్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె న్యూయార్క్‌లో కీమో థెరపీ చికిత్స చేయించుకుంటున్నారు. ఇందుకోసం ఇటీవల తన జుట్టును కొద్దిగా కత్తిరించుకున్న ఫొటోలు షేర్‌ చేశారు. కాగా..ఇప్పుడు సోనాలి కీమో చికిత్స నిమిత్తం గుండు చేయించేసుకున్నారు. గుండుతో ఉన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేయగానే అభిమానులు షాకయ్యారు. ఫొటోలో తన స్నేహితులు సుసాన్నే ఖాన్‌, గాయత్రి ఒబెరాయ్‌లు కూడా ఉన్నారు.  ఈ సమయంలో నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇలా చెబితే కొందరు నన్ను వింతగా చూస్తారని తెలుసు. కానీ నేను సంతోషంగా ఉన్నానన్నది నిజం. ఎందుకంటే.. నా జీవితంలోని ప్రతి క్షణానికి విలువ ఇస్తున్నాను. సంతోషంగా ఉండటానికి అవకాశాలను వెతుక్కుంటున్నాను. మరో పక్క బాధ పడిన క్షణాలు కూడా ఉన్నాయి. కానీ నాకు నచ్చిందే చేస్తున్నాను. నాకు నచ్చిన వారితో సమయం గడుపుతున్నాను అని ఆమె పేరుకొన్నారు.

Related Posts