YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఏపీ ఫైబర్ లో పోలవరం లైవ్

 ఏపీ ఫైబర్ లో  పోలవరం లైవ్
రాష్ట్ర ప్రజల కలల ప్రాజెక్టు పోలవరం నిర్మాణ పనులను చూడ్డానికి గోదావరి నది వద్దకు ఇక వెళ్లనవసరం లేదు. ఇంటి నుంచే నేరుగా టీవీలో వీక్షించే అవకాశాన్ని రాష్ట్ర ఫైబర్ నెట్ సంస్థ కల్పించింది. సంస్థ పరిధిలోని వినియోగదారులకు ఆదివారం నుంచి ఈ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం సంబంధిత పనులు చేయిస్తోంది. చుట్టూ ఎంపిక చేసిన ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిత్యం నిర్మాణ పురోగతిని పర్యవేక్షిస్తున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పైబరినెట్ తో అనుసంధానం చేశారు. ఈ కనెక్షన్లు ఉన్న వారు రిమోట్ తో మెనూ పేజీలో సర్లెన్స్ అప్లికేషన్ ను ఎంపిక చేయగానే పోలవరం లోగో కనిపిస్తుంది.దాన్ని ఎంపిక చేస్తే వరుసగా అయిదు వీడియో కెమెరాలు ప్రత్యక్షమవుతాయి. వాటిని క్లిక్ చేయడం ద్వారా ప్రాజెక్టు దృశ్యాలను ప్రత్యక్షంగా తిలకించవచ్చు. ఎంపిక చేసుకున్న కెమెరాలతో స్పిల్ వే, స్పిల్ వే కెనాల్ నిర్మాణ పనులు చూడొచ్చు. ఇంట్లో టీవీ నుంచి ప్రాజెక్టు పనులను ప్రత్యక్షంగా చూస్తున్న వినియోగదారులు కొత్త అనుభూతికి లోనవుతున్నారని ఏపీ ఫైబర్ నెట్ అధికారులు చెబుతున్నారు. మరో పక్క, పోలవరం పై ఈ రోజు రివ్యూ జరిగింది. ప్రాజెక్టులో కీలక నిర్మాణాలకు అనుభవం ఉన్న కాంట్రాక్టర్లను వెంటనే తీసుకురావాలని ఇంజనీరింగ్‌ అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. సోమవారం సచివాలయం నుంచి 70వ సారి వర్చువల్‌ పద్ధతిలో పోలవరం పనులపై సమీక్షించారు. స్పిల్‌వే, స్పిల్‌ చానల్‌ కాంక్రీట్‌ పనులను డ్రోన్‌ కెమెరాల సాయంతో పరిశీలించారు. పనుల వివరాలను ప్రాజెక్టు ప్రభుత్వ సలహాదారుడు రమేశ్‌బాబు వివరించారు

Related Posts