YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

జలాలను సద్వినియోగం చేసుకోవాలి అధికారులతో సీఎం చంద్రబాబు

 జలాలను సద్వినియోగం చేసుకోవాలి అధికారులతో సీఎం చంద్రబాబు
సోమవారం నాడు నీరు-ప్రగతి,వ్యవసాయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  జిల్లాల కలెక్టర్లు,వివిధ శాఖల అధికారులు పాల్గోన్నారు. గత 3రోజులుగా వర్షాలు బాగా పడుతున్నాయి. అయినా ఇంకా 14%లోటు వర్షపాతం ఉంది. 8జిల్లాలలో వర్షపాతం లోటు ఉంది.ప్రతిఏటా జులైలో వర్షాలు తగ్గడం,ఆగస్టులో మళ్లీ పెరగడం చూస్తున్నాం. ప్రజలకు నీటి భద్రత ఇవ్వాలి.ఉపరితల జలాలు,భూగర్భజలాలు సద్వినియోగం చేసుకోవాలని అయన సూచించారు. సమర్ధ నీటి నిర్వహణ ద్వారా నీటి కొరత అధిగమించాలి. రిజర్వాయర్లకు 40% నీటి చేరిక ఉంది.శ్రీశైలంకు లక్ష క్యూసెక్కుల వరద ప్రవాహం ఉంది.నాగార్జున సాగర్,శ్రీశైలం జలాశయాలకు ఇంకా 210టిఎంసిలు రావాలి. చిన్ననీటిపారుదలకు 23%మాత్రమే నీటి చేరిక ఉందని అయన అన్నారు. వంశధార రెండవ దశ పనులు వేగంగా జరుగుతున్నాయి. హీరమండలం రిజర్వాయర్ వరకు పనులు పూర్తిచేశారు.హీర మండలంలో 5టిఎంసీలు పెడతాం. భూసేకరణ,ఆర్ అండ్ ఆర్ పనులు పూర్తిచేశారు.  పరిశ్రమించక పోతే ఏ ప్రాజెక్టు పూర్తికాదు. రైతుల్లో నిరాశా నిస్పృహలు పోగొట్టగలిగాం. ఇచ్ఛాపురం వరకు నీళ్లు తీసుకెళ్లాలి.శ్రీకాకుళంలో వలసలు లేకుండా చేయాలని అన్నారు.  వ్యవసాయం పురోగతితో వలసలు అదృశ్యం.  శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటికే ఖరీఫ్ లో నీటిలభ్యత పెంచాం. ముందస్తు రబీకి రైతులను ప్రోత్సహించాలి. సముద్రంలోకి పోయే నీటిని తగ్గించగలిగాం.150 ఏళ్లలో జూన్ లో నీళ్లివ్వడం కృష్ణాడెల్టాలో చరిత్ర. వర్షాభావం ఉన్నా రిజర్వాయర్లలోకి నీళ్లు చేరడం మన అదృష్టమని అయన అన్నారు. రాయలసీమలో వర్షాలు లేవు,అయినా రిజర్వాయర్ల నుంచి నీళ్లు ఇవ్వగలిగాం. మైనర్ ఇరిగేషన్ నీటిచేరిక 204టిఎంసిలకు 23% మాత్రమే వచ్చాయి. అన్ని చెరువులు,సెలయేళ్ల పనులు ముమ్మరం చేయాలి. నరేగాలో 20కోట్ల పనిదినాలకు 15కోట్లు పూర్తిచేశాం. రూ.4వేల కోట్లు నరేగా నిధులు వినియోగించుకున్నాం. ఈ వారంలో వేజ్ ఎక్స్ పెండిచర్ రూ.150కోట్లు చేశామని చంద్రబాబుఅన్నారు. ప్రతివారం ఇలాగే చేస్తే అనుకున్న లక్ష్యాలు చేరుకోగలం. ఉద్యానపంటల సాగు కోటి ఎకరాలకు చేరాలి.హార్టీకల్చర్ రాబడి మరింతగా పెరగాలి.బిందు,తుంపర్ల సేద్యాన్ని భారీఎత్తున ప్రోత్సహించాలి. పాడి పరిశ్రమ,పండ్లతోటల సాగు ద్వారా ఆదాయం మరింత పెరగాలి. హవుసింగ్ పనులు ముమ్మరం చేయాలి.అక్టోబర్ కు 3లక్షలు,జనవరికి మరో 3లక్షల ఇళ్లు పూర్తిచేయాలని అయన ఆదేశించారు. అన్నివనరులు సమర్ధంగా వినియోగించుకోవాలి. ప్రపంచంలో మన రాష్ట్రం అగ్రగామి కావాలని అన్నారు.

Related Posts