YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పోటెత్తున్న గోదావరి బిక్కు బిక్కు మంటున్న లంక గ్రామాల వాసులు

 పోటెత్తున్న గోదావరి బిక్కు బిక్కు మంటున్న లంక గ్రామాల వాసులు
రెండు రోజుల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దీంతో ప్రజలు అసౌకర్యానికి గురయ్యారు. మరో వైపు ఏజెన్సీలో వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఫలితంగా 60 గిరిజన గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. దేవీపట్నం మండలంలోని దండంగి వాగు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో ఎగువన ఉన్న 30 గ్రామాల ప్రజలకు రవాణా నిలిచిపోయింది. కొండమొదలు, కచ్చులూరు తదితర గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఏజెన్సీలో భారీ వర్షాలతో గోదావరిలో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి గురువారం 4.79 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. వరద తీవ్రత  కొంత తగ్గుముఖం పట్టినా వర్షాలు కొనసాగుతుండడంతో గోదావరి పరీవాహక ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. మారేడుమిల్లి మండలం బొడ్లంక వద్ద పెళ్లిరేవు వాగు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి.అంగుళూరు వద్ద తాటిపాక కాలువకు వరదతో నాలుగు గ్రామాలకు రవాణా స్తంభించింది. భారీ వర్షాలతో పలు గ్రామాల్లో విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ప్రమాదకరంగా ఉన్న లంక గ్రామాలకు రాకపోకలు సాగించేందుకు ప్రభుత్వం ఆధ్వర్యంలో పంట్లను  ఏర్పాటు చేస్తామని గతంలో ఉన్నతాధికారులు ప్రకటించినా ఆచరణలో కానరావడం లేదు. దీంతో లంక గ్రామాల ప్రజలు ఇప్పటికీ నాటు పడవలపైనే ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణం సాగించాల్సి వస్తోంది. వీరికి లైఫ్‌జాకెట్లు అరకొరగా సరఫరా చేశారు. దీనికితోడు వీటి వినియోగంపై కూడా పర్యవేక్షణ కొరవడడంతో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండానే ప్రజలు పడవల్లో నదిని దాటుతున్నారు.పరీవాహక ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. మారేడుమిల్లి మండలం బొడ్లంక వద్ద పెళ్లిరేవు వాగు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి.అంగుళూరు వద్ద తాటిపాక కాలువకు వరదతో నాలుగు గ్రామాలకు రవాణా స్తంభించింది. భారీ వర్షాలతో పలు గ్రామాల్లో విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అప్రమత్తమైన సబ్‌కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ ముందస్తు చర్యలకు ఉపక్రమించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించి తగిన చర్యలు చేపట్టేలా వీఆర్‌వోలు, వీఆర్‌ఏలను వివిధ గ్రామాల్లో నియమించారు. ప్రమాదకరంగా ఉన్న లంక గ్రామాలకు రాకపోకలు సాగించేందుకు ప్రభుత్వం ఆధ్వర్యంలో పంట్లను  ఏర్పాటు చేస్తామని గతంలో ఉన్నతాధికారులు ప్రకటించినా ఆచరణలో కానరావడం లేదు. దీంతో లంక గ్రామాల ప్రజలు ఇప్పటికీ నాటు పడవలపైనే ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణం సాగించాల్సి వస్తోంది. వీరికి లైఫ్‌జాకెట్లు అరకొరగా సరఫరా చేశారు. దీనికితోడు వీటి వినియోగంపై కూడా పర్యవేక్షణ కొరవడడంతో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండానే ప్రజలు పడవల్లో నదిని దాటుతున్నారు

Related Posts