YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

27న అమరావతి బాండ్ల లిస్టింగ్

 27న అమరావతి బాండ్ల లిస్టింగ్
1300 వందల కోట్ల పెట్టుబడి ఆకర్షించాలి అన్న టార్గెట్ తో విడుదల అయిన అమరావతి బాండ్లు...విడుదల అయిన గంటలో 2000 కోట్ల పైగా పెట్టుబడులు వచ్చాయి... ఇది ఒక రకమైన ఊచకోత, అని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి.. ఇది మన రాష్ట్రం మీద ఉన్న నమ్మకం... మన నాయకుడి మీద ఉన్న నమ్మకం... నిన్న బొంబాయి స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ లో, అమరావతి ప్రభంజనం చూసాం.. గంట వ్యవధిలోనే ఒకటిన్నర రెట్లు అదనంగా సబ్‌స్ర్కైబ్‌ అయ్యాయి.. ఇదే ఉత్సాహంతో అంతర్జాతీయ మార్కెట్‌లోనూ బాండ్లు ప్రవేశపెట్టాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. త్వరలోనే లండన్‌ స్టాక్‌ ఎక్స్చేంజిలో అమరావతి బాండ్లను లిస్ట్‌ చేయాలని భావిస్తోంది.సీఆర్‌డీఏ అధికారులు అమరావతి బాండ్ల పట్ల మదుపరుల నమ్మకం చూరగొనడానికి విస్తృత ప్రచారం నిర్వహించారు. ముంబయిలో సమావేశాలు నిర్వహించారు. మదుపరులు పెట్టే అసలుకి, వడ్డీకి రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చింది. 10.32 శాతం వడ్డీ కూడా ఆకర్షణీయంగా ఉండటంతో మదుపరుల్ని ఈ బాండ్లు బాగా ఆకర్షించాయి. ముంబయి నుంచి కొందరు మదుపరులు వచ్చి రాజధానిలో జరుగుతున్న పనుల్ని చూసి వెళ్లారు. ఆ తర్వాతే బాండ్లలో మదుపు చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. గడచిన 30-40 ఏళ్లలో దేశంలోని వివిధ మున్సిపాలిటీలు బాండ్లు విడుదల చేసి సమీకరించిన మొత్తం రూ.1800 కోట్లయితే, తాము అమరావతి బాండ్ల ద్వారా ఒక్క రోజే రూ.2 వేల కోట్లు సమీకరించామని సీఆర్‌డీఏ అధికారులు తెలిపారు. రాజధాని నగర నిర్మాణం కోసం ఇలా నిధులు సమీకరించడం దేశంలో మొదటిసారని పేర్కొన్నారు.అమరావతి బాండ్లను ఈ నెల 27న బీఎస్‌ఈలో లిస్టింగ్‌ చేయనున్నారు. ఆ కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరవనున్నారు. ముంబయిలోని ప్రముఖ వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారుల్ని కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తారు. అమరావతి బాండ్లను బీఎస్‌ఈలో నమోదు చేశాక... సెకండరీ మార్కెట్‌లో క్రయవిక్రయాలకు వీలుంటుంది. అంటే బాండ్లు కొనుగోలు చేసినవారు... మరొకరికి వాటిని విక్రయించుకోవచ్చు. బీఎస్‌ఈలో సంస్థాగత మదుపుదారులకోసం మాత్రమే అమరావతి బాండ్లను అందుబాటులో ఉంచారు. అయితే, సామాన్య ప్రజలు కూడా, వీటిని కొనేలా, మరో మూడు నాలుగు నెలల్లో రీటెయిల్‌ బాండ్లు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సీఆర్‌డీఏ కమిషనర్‌ శ్రీధర్‌ తెలిపారు. సాధారణ ప్రజలు, ఎన్‌ఆర్‌ఐలు రాజధాని నిర్మాణంలో పాలుపంచుకునేందుకు వీలుగా కనీసం రూ.100 పెట్టుబడి పెట్టేలా వీటిని మార్కెట్‌లోకి తెస్తామన్నారు. వడ్డీ ఎంత ఉండాలి వంటి విషయాలపై త్వరలో ఒక స్పష్టతకు వస్తామన్నారు.

Related Posts