YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఏపీ బాండ్ల బ్రాండ్ క్రెడిట్ ఎవరిది...

ఏపీ బాండ్ల  బ్రాండ్ క్రెడిట్ ఎవరిది...
ఏపీకి సంబంధించిన ఏ క్రెడిట్ అయినా త‌మ ఖాతాలో వేసేసుకునేందుకు సీఎం చంద్ర‌బాబు, ఆయ‌న త‌న‌యుడు, మంత్రి లోకేష్ సిద్ధంగా ఉంటార‌నేందుకు మ‌రో నిద‌ర్శ‌న‌మిదే! కేంద్రం నిధులు ఇచ్చినా.. అది త‌మ పోరాటం వ‌ల్లేన‌ని, ఏ చిన్న కంపెనీ వ‌చ్చినా అది తమ అభివృద్ది వ‌ల్లేనంటూ ఢంకా మోగించేసుకోవ‌డం ప‌రిపాటిగా మారిపోయింది. వీలైనంత వ‌ర‌కూ అది తమ గొప్పేనంటూ.. ప్రచారం క‌ల్పించేసుకోవ‌డం నాలుగేళ్ల‌లో విప‌రీతంగా పెరిగింది. ప్రస్తుతం అమ‌రావ‌తి బాండ్ల విష‌యంలోనూ ఇదే జ‌రుగుతోంది. అమ‌రావ‌తి నిర్మాణానికి ఇప్ప‌టికే చాలా సార్లు శంకుస్థాప‌న‌లు చేసి ఇంకా నిర్మాణాలు ప్రారంభించ‌ని విష‌యం తెలిసిందే! ఇప్పుడు రాజ‌ధాని నిర్మాణానికి బాండ్ల‌ను అత్య‌ధిక మొత్తం చెల్లించేందుకు ఆఫ‌ర్ చేయ‌డంతో సీఆర్‌డీఏ జారీ చేసిన బాండ్ల‌కు భారీ గిరాకీ ఏర్ప‌డింది. ఇది కూడా చంద్రబాబు, లోకేష్ వ‌ల్లే అంటూ ఆకాశానికి ఎత్తేసే ప్ర‌య‌త్నాలు మొద‌లైపోయాయి. అయితే, రానున్న ఎన్నికల్లో ఎలాగైనా టీడీపీ గెలవాలనే పట్టుదలతో ఉన్న టీడీపీకి అనుకూలంగా ఉన్న కొంతమంది ఇన్వేస్టర్లు చంద్రబాబు ఇమేజ్ పెంచేందుకే ఇలా డిమాండ్ పెంచారని తెలుస్తోంది. ఇక, ఇక్కడ మరో విషయం ఏమిటంటే… బాండ్లు విడుదల చేసిన గంటలోనే అంత డిమాండ్ రావడానికి ఇన్సైడ్ ట్రేడింగ్  కారణంగా కనపడుతోంది. అంటే, అమరావతి బాండ్లను ప్రవేశపెడుతున్నారని ముందుగానే కొందరికి సమాచారం ఉన్నట్లు స్పష్టమవుతోంది. లేకపోతే, గంటలోనే అంత డిమాండ్ సాధ్యం కాదు అంటున్నారు కొందరు పరిశీలకులు.ఎన్నిక‌లు స‌మీపిస్తున్న కొద్దీ అమ‌రావ‌తి నిర్మాణంపై సీఎం చంద్ర‌బాబు దృష్టిసారిస్తున్నారు. అత్య‌ద్భుత‌మైన రాజ‌ధానిని నిర్మిస్తామ‌ని చెబుతున్న ఆయ‌న‌.. నాలుగేళ్ల‌లో ఒక్క నిర్మాణాన్ని కూడా చేప‌ట్టలేదు. ఇంకా వీటికి సంబంధించిన డిజైన్లు కూడా పూర్తి చేయ‌లేదు. ఇప్ప‌టికే సింగ‌పూర్ కంపెనీల‌కు ఈ బాధ్య‌త‌లు అప్ప‌గించిన చంద్రబాబు.. ఆర్థిక వ‌న‌రులు స‌మకూర్చేందుకు ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టారు. అందుకే రాజధాని బాండ్లు అమ్మే ప్ర‌క్రియ‌ను చేప‌ట్టింది. ఇటీవలే తెలంగాణ సర్కారు కు చెందిన జీహెచ్ఎంసీ కూడా బాండ్స్ మార్కెట్ ద్వారా రుణాలు సేకరించింది. అయితే ఈ బాండ్లపై వడ్డీ రేటు 8.5 శాతమే. కానీ అమరావతి బాండ్లను 10.32 శాతం వడ్డీ చెల్లించటానికి సర్కారు సిద్ధపడింది.నిజంగా ఏపీ సీఎం చంద్రబాబు బ్రాండ్ ను చూసే సింగపూర్ కంపెనీలు చకచకా రాజధాని కట్టేస్తున్నాయా? ఆయన బ్రాండ్ ను చూసే అమరావతి బాండ్లు హాట్ కేకుల్లా అమ్ముడు అయ్యాయా? అనే ప్ర‌శ్న‌లు వినిపిస్తున్నాయి. అసలు చంద్రబాబు బ్రాండ్ లేకపోతే ఈ బాండ్లు అమ్ముడుపోయేవే కావంటూ అనుకూల మీడియా అంతా ఊదరగొడుతూ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తోంది. ఈ బాండ్లకు సర్కారు గ్యారెంటీ కూడా ఉంది. బాండ్ల మార్కెట్లోనే ఇది అత్యధిక వడ్డీ కావటం ఒకెత్తు అయితే అందులో ప్రభుత్వ గ్యారంటీ అనేది మరో సానుకూల అంశం. ఇందులో సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారా లోకేష్‌ బ్రాండ్ క్రెడిబులిటీ ఏముంది? ఎన్నికల్లోపు వీలైనంత మేర అప్పులు తీసుకొచ్చి.. కాంట్రాక్టులు అప్పగించి.. దండుకోవటమే పనిగా పలు స్కీమ్‌లు డిజైన్ చేస్తున్నారని అధికార వర్గాలు తెలిపాయి.వాస్తవానికి అమరావతి బాండ్లకు సంబంధించిన వడ్డీ రేట్లపై చంద్రబాబు ప్రభుత్వంలోని ఆర్థిక శాఖే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. వివిధ శాఖల వద్ద ఉన్న నిధులను తాము సర్దుబాటు చేస్తామని అంత ఎక్కువ రేట్లతో కూడిన బాండ్లు కూడా వద్దని వారించింది. అయినా చంద్రబాబు.. ఆర్థిక శాఖ అభ్యంతరాలను తోసిపుచ్చి.. తాను అనుకున్నట్లు అత్యధిక వడ్డీతో బాండ్లను జారీ చేసింది. ఇదంతా తన గొప్పతనం అని చెప్పుకోవ‌డంతో అధికార వర్గాలు విస్మయానికి గురవుతున్నాయి. సీఆర్‌డీఏ ఇప్పుడు సమీకరించిన రెండు వేల కోట్ల‌తోపాటు.. రాబోయే రోజుల్లో తీసుకోబోయే రుణాలపై వడ్డీ భారం ప్రజల నెత్తినే ప‌డ‌నుంది. ఇలా వడ్డీ భారం చాలా ఎక్కువ అని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొంటున్నా యి. వాస్తవాలు ఇలా ఉంటే అనుకూల‌ మీడియా ద్వారా చంద్రబాబు ఎవరూ సాధించలేని సక్సెస్ సాధించినట్లు హోరెత్తిస్తోంది

Related Posts