YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

కళలు

తెనాలిలో నంది నాటకోత్సవాలు..

తెనాలిలో నంది  నాటకోత్సవాలు..

తెనాలిలోని తెనాలి రామకృష్ణకవి కళాక్షేత్రంలో శుక్రవా రం  నుండి  నంది నాటకోత్సవాలు  9 రోజులపాటు ప్రదర్శనలు కొనసా గుతున్నాయి. తెనాలితో పాటు కాకినాడ, రాజమహేంద్రవరం, నంద్యాల, కర్నూలు పట్టణాల్లో ఈ నంది నాటకోత్సవాలు జరుగుతున్నాయి.

మిగిలిన చోట్ల ఈ ఉత్సవాలు ఈ నెల 2 నుంచి ఏప్రిల్‌ 12 వరకు నిర్వహిస్తుంటే, తెనాలిలో ఈ నెల 2నుంచి 10వ తేదీ వరకు జరుగుతాయి. ఈ పోటీలకు రాష్ట్రం నుంచేకాక, తెలంగాణ, ఇతర రాష్ట్రాల నుంచి 360కిపైగా దరఖాస్తులు ప్రదర్శన కోసం వచ్చాయి.విజేతలకు ఏప్రిల్‌ 16న తెలుగు నాటక రంగ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చేతులమీదుగా పురస్కారాలు అందజేస్తారు. పద్య నాటిక విభాగంలో రూ.30వేలు, నాటకాల విభాగంలో రూ.20 వేలు, నాటికలకు రూ.15వేలు వంతున ప్రతి ప్రదర్శనకు నగదు పారితోషికం ఇస్తారు. కళాకారులకు ఉచిత భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తారు.

తొలి రోజు ప్రదర్శించే ఐదు నాటికల వివరాలు ఇలా ఉన్నాయి. ఉదయం 11.30 గంటలకు నేడు ఏడుస్తున్నాను - మీరు నవ్వుకోండి, 2 గంటలకు మనిషి పారిపోయాడా, 3.30 గంటలకు చీకట్లో చిరుదివ్వెలు, 5 గంటలకు బడితోనే భవిత భద్రం, 8 గంటలకు వైకుంఠం నాటికలు ప్రదర్శిస్తారు.

  1 to 1   

Related Posts