YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఉప్పు, నిప్పు కలుస్తాయా...

 ఉప్పు, నిప్పు కలుస్తాయా...
ఏపీలో మొన్నటివరకు ఉప్పు నిప్పుగా ఉన్న టీడీపీ, కాంగ్రెస్‌ వచ్చే ఎన్నికల కోసం కలవబోతున్నాయా.. ప్రత్యర్థి పార్టీల్ని ఓడించేందుకు ఈ రెండు సీనియర్‌ పార్టీలు స్నేహ హస్తాలు అందించుకోబోతున్నాయా.. టీడీపీతో పొత్తు పెట్టుకుని ఏపీలో మళ్లీ పుంచుకునేందుకు కాంగ్రెస్‌ ట్రై చేస్తుంటే... కాంగ్రెస్‌ని కలుపుకుని.. వైసీపీ ఓటు బ్యాంకుని టీడీపీ చీల్చాలని అనుకుంటోంది. ఏపీ రాజకీయాల్లో ఏం జరగబోతోంది. టీడీపీ, కాంగ్రెస్‌ కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాయని వస్తోన్న వార్తల్లో నిజమెంత.ఎన్నికలు సీజన్‌ మొదలైపోయింది. తెలంగాణలో అయితే.. ముందస్తుకు సిద్ధం అంటూ పార్టీ రెడీ అయిపోతున్నాయి. అటు టీఆర్‌ఎస్‌ సరికొత్త పథకాలతో ప్రజల్లోకి వెళ్లిపోతుంటే.. కాంగ్రెస్‌ కూడా ముందస్తుగా సై అంటే సై అంటోంది. ఎన్టీటైమ్‌.. ఎప్పుడు ఎన్నికలు పెట్టినా విజయం మాదే అంటోంది. అటు ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఎన్నికల హడావుడి మొదలైపోయింది. ఎవరికి వారు తమ ప్రయత్నాల్లో బిజీగా ఉన్నారు. పార్టీలు మాత్రం... ఈసారి సోలోగా వెళ్లకుండా.. పొత్తులు పెట్టేందుకు సిద్ధపడుతున్నాయి. ఈ క్రమంలో.. అధికార టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు పెట్టుకోబోతోందనే న్యూస్‌ ఇప్పుడు బాగా విన్పిస్తోంది. 2014 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ విజయ బావుటా ఎగరవేసింది. కాంగ్రెస్‌ పార్టీకి ఒక్కటంటే ఒక్క సీటు కాదు కదా డిపాజిట్‌ కూడా రాలేదు. ఆంధ్రుల మనోభావాలను పట్టించుకోకుండా తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ పార్టీ ఇవ్వడమే అందుకు కారణం. దీంతో.. తెలుగు ప్రజలు తమ కోపాన్ని ఓటు రూపంలో చూపించారు. కాంగ్రెస్‌ పార్టీని ఏపీలో భూస్థాపితం చేసేశారు. ఇక తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో పుట్టింది తెలుగుదేశం పార్టీ. తెలుగువారి ఆత్మాభిమానాన్ని... కాంగ్రెస్‌ పార్టీ, ఆ నాయకులు అంతా కలిసి ఢిల్లీ దగ్గర తాకట్టు పెడుతున్నారనే విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించి.. రాజకీయాల్లో సంచలనం సృష్టించారు ఎన్టీఆర్‌. ఆయనకున్న ఇమేజ్‌, ఆత్మగౌరవ నినాదం రెండూ కలిసి తెలుగుదేశం పార్టీకి అఖండ విజయాన్ని కట్టబెట్టాయి. ఇక అప్పటినుంచి ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, కాంగ్రెస్‌ రెండూ సై అంటే సై అంటూ పోటీకి దిగాయి. ప్రతీసారి తమ సత్తా నిరూపించుకుంటున్నాయి. ఇన్నాళ్లూ కాంగ్రెస్‌ ఉండేది. ఇప్పుడు ఆ ప్లేస్‌లోకి వైసీపీ వచ్చింది. జనసేన కూడా సై అంటోంది. దీంతో.. ఇన్నాళ్లు బద్ధ శత్రువుగా భావించిన కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని.. వచ్చే ఎన్నికల్లో మరింత బరిలోకి దిగాలని టీడీపీ భావిస్తుందనే చర్చ ఇప్పుడు ఇప్పుడు తెలుగు రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. మరోవైపు.. రీసెంట్‌గా బెంగళూరు వెళ్లినప్పుడు.. అక్కడ రాహుల్‌ చంద్రబాబు కలవడం కూడా.. టీడీపీ, కాంగ్రెస్‌ కలవబోతున్నాయనే వార్తలకు బలం చేకూరినట్లైంది. ఇదే అంశాన్ని టార్గెట్‌గా చేసుకుని.. వైసీపీ, బీజేపీ టీడీపీపై విమర్శలు ఎక్కుపెట్టాయి. అయితే... కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు విషయంలో టీడీపీ ఇంతవరకు ఎలాంటి ప్రకటనా చేయలేదు. మరి  రాజీకయ వర్గాల్లో జరుగుతున్న ప్రచారంపై ప్రజలు ఏమనుకుంటున్నారు.. కాంగ్రెస్‌, టీడీపీ దోస్తీపై ప్రజల అభిప్రాయం ఏంటి. ఈ పొత్తు.. టీడీపీకి ప్లస్సా, మైనస్సా భవిష్యత్ లో తేలిపోనుంది.. 

Related Posts