YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం

మీరు అవినీతికి వారసులు..

 మీరు అవినీతికి వారసులు..

లక్షల కోట్లు ఎలా వచ్చాయ్..?

- రాయలసీమ కరువు పట్టదా..?

-  పెనుదుమారం రేపుతున్నసోమువీర్రాజు సంచలన వ్యాఖ్యలు..!

 ఏపీ బీజేపీ- టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం ఇప్పట్లో ముగిసేట్లు లేదు. ఓ వైపు పార్టీల అధినేతలు, జాతీయాధ్యక్షులు మిత్రపక్షంతో మంచిగా ఉండండి అనవసరంగా ఆరోపణలు చేయొద్దని పదే పదే మొత్తుకుంటున్నా ఆదేశాలను బేఖాతరు చేసి మీడియా ముందుకొచ్చి తమదైన శైలిలో నేతలు రెచ్చిపోతున్నారు. అయితే మా సొంత అజెండాతో మేం ముందుకు పోవట్లేదు మా పార్టీ అధ్యక్షుడి ఆదేశాల మేరకే టీడీపీ అవినీతిని, నిధుల విషయంపై ప్రశ్నల పరంపర సాగిస్తున్నామని తాజాగా బీజేపీ ఎమ్మెల్సీ సోమువీర్రాజు చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపుతున్నాయి. అయితే రెండు రోజులుగా టీడీపీ నేతల నోటికి మాత్రం సీఎం చంద్రబాబు తాళాలు వేశారని చెప్పుకోవచ్చు. కర్నూలు అసెంబ్లీ పరిధిలో బూత్ స్థాయి బీజేపీ నేతల సమావేశంలో సోము వీర్రాజు మాట్లాడుతూ టీడీపీ నేతలు, టీడీపీ అధినేతపై సంచలన ఆరోపణలు, వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

‘మేము నిప్పులాంటి వాళ్లం...
టీడీపీ, టీడీపీ అధినేతపై సోమువీర్రాజు మరోసారి దుమారం రేపే వ్యాఖ్యలు చేశారు. ‘మేము(బీజేపీ) నిప్పులాంటి వాళ్లం.. మీరు (టీడీపీ)అవినీతికి వారసులని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో ఓ మహానేతను భూస్థాపితం చేసి రాజ్యమేలుతున్న వారు మీరని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీని రాష్ట్రంలో బలోపేతం చేయడమే తన అజెండా అని తనకు ఏ సొంత ఎజెండా లేదన్నారు. రాష్ట్రంలో పార్టీ రూలింగ్ లేదనీ ట్రేడింగ్ మాత్రమే జరుగుతోందని ఆయన స్పష్టం చేశారు. 
ఎప్పుడు చూసినా రెండెకరాల రైతును అంటున్న మీకు లక్షల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయని సీఎం చంద్రబాబును ఉద్దేశించి సోము వీర్రాజు వ్యాఖ్యలు చేశారు. మా పార్టీ అధ్యక్షుడి ఆదేశాల మేరకే అవినీతిపై ఎదురుతిరుగుతున్నామని, తమకు ఎలాంటి సొంత అజెండా లేదని ఈ సందర్భంగా ఆయన చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి నాంది పలికింది కేంద్ర ప్రభుత్వమేనని, కేంద్ర నిధులు రాష్ట్రంలో స్వార్థ పరులకు ఆదాయ వనరులుగా మారాయని వీర్రాజు ఆరోపించారు. స్వయంగా ముఖ్యమంత్రి నియోజకవర్గంలో భారీ అవినీతి జరిగింది నిజం కాదా? అని ఆయన ప్రశ్నించారు. అయితే ఈ వ్యాఖ్యలకు టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.
నవ్యాంధ్ర రాజధాని అమరావతికి లక్ష కోట్లు కావాలంటూ భజన చేస్తున్న సీఎం చంద్రబాబుకు.. రాయలసీమ కరువు గురించి ఎందుకు మాట్లాడటం లేదని ఆయన సూటి ప్రశ్న సంధించారు. ఆ విషయాన్ని ఎప్పుడో గాలికొదిలేశారని తీవ్ర విమర్శలు గుప్పించారు. మేమంతా కాంగ్రెస్ పార్టీ కోవర్టులం కాదని, చంద్రబాబే ఒకప్పుడు కాంగ్రెస్‌‌లో పనిచేశారన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

వీర్రాజు ఆరోపణలపై కేంద్ర మంత్రి సుజనా.. 
ఇవన్నీ సోమువీర్రాజు వ్యక్తిగత విషయాలనీ ఈ మాటలన్నీ ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని కేంద్రమంత్రి సుజనా స్పష్టం చేశారు. మీడియా వాళ్లే వెళ్లి సోము వీర్రాజును అడగాలని మేం మాట్లాడిన మాటలకే సమాధానమిస్తామని ఆయన చెప్పుకొచ్చారు.

Related Posts