YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం

ముద్దుల మావయ్య..బాలయ్య

ముద్దుల మావయ్య..బాలయ్య

న్యూజెర్సీలో ఏపీ ఎన్నారైలతో మంత్రి లోకేష్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆయన ఎన్నారైల నుంచి పలు సూచనలు తీసుకున్నారు. లోకేశ్ ప్రసంగిస్తూ ఉండగా చర్చంతా బాలకృష్ణ వైపుకు వెళ్లింది. ఒక్కసారి సభా ప్రాంగణమంతా బాలయ్య.. బాలయ్య అంటూ నినదించారు. ఓ సందర్భంలో వారిని కట్టడి చేయడానికి లోకేశ్, బాలకృష్ణపై పొగడ్తలు కురిపించారు. సింహం గురించి తాను ఏం చెప్పాలని ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువేనన్నారు. సమరసింహారెడ్డి, నరసింహానాయుడు, లెజెండ్, సింహా లాంటి సినిమాల్లో బాలయ్య అద్భుతంగా నటించారని కితాబిచ్చారు. బాలయ్యపై లోకేశ్ పొగడ్తల వర్షం కురిపిస్తుంటే ఎన్నారైలు హర్షద్వానాలు పలికారు. ఎన్నారైలను ఉద్దేశించి ‘‘మీ అందరికీ ఆయన బాలయ్య.. నాకు మాత్రమే ముద్దుల మావయ్య’’ అంటూ సరదాగా వారితో లోకేశ్ సంభాషించారు.

Related Posts