YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

కళలు

మైమరిపించిన నృత్య విన్యాసాలు..

మైమరిపించిన నృత్య విన్యాసాలు..

శిల్పారామం ఆంపిథియేటర్‌లో సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా బాలనృత్య కళాకారిణులు ప్రదర్శించిన కూచిపూడి నృత్యం ముగ్ధమనోహరంగా సాగింది. అమృత ఆర్ట్స్‌కు చెందిన సాయిగీత నేతృత్వంలో ఆమె శిష్యబృందం జయము, జయము.., మూషిక వాహన, ఇదిగో భద్రాద్రి, అదిగో అల్లదిగో, నమశ్శివాయతే, వినాయక స్తుతి, తదితర అంశాలపై లయ తప్పకుండా నృత్యం చేసి విశేషంగా అలరించారు. కీర్తన, అమృత, అక్షిత, హిమాని, అన్విత, భవ్య, సునిత, ప్రవళ్లిక తదితరులు తమ నృత్యాలతో ఆహుతుల ప్రశంసలందుకున్నారు.

Related Posts