YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

కళలు

మైమ్ కు ఘన సత్కారం ..

మైమ్ కు ఘన సత్కారం ..

ఎస్‌.ఎన్‌.మ్యూజిక్‌ అకాడమీ, సంకీర్తన కల్చరల్‌ సొసైటీల ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి రవీంద్రభారతిలో సాంస్కృతికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కల్ప, తాడూరి అనురాధ, రాజ్‌కుమార్‌, షాకత్‌, డా.నాగ శ్రీరామరెడ్డి, అనురాధ, విభు, విరాట్‌, అరేన్‌ ప్రదర్శించిన సంగీత, గాత్ర కచేరి ఆహుతులను సమ్మోహితులను చేసింది. అనంతరం జరిగిన అభినందన సభలో ఆకాశవాణి విశ్రాంత డిప్యూటీ డైరక్టర్‌ జనరల్‌ మంగళగిరి ఆదిత్యప్రసాద్‌, సీనియర్‌ పాత్రికేయులు పాశం యాదగిరి, ప్రముఖ సినీ దర్శకులు వి.ఎన్‌.ఆదిత్య, మిమిక్రీ శ్రీనివాస్‌, కె.ఎ.శాస్త్రి ఆత్మీయ అతిథులుగా హాజరై కళాకారులను అభినందించారు. అనంతరం నేషనల్‌ వీవర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు పన్నాల శ్రీరాములు, సీనియర్‌ జర్నలిస్టు రాంచందర్‌, ప్రముఖ ముఖాభినయ కళాకారులు మైమ్‌ మధు, సీనియర్‌ న్యాయవాది మాచర్ల కమలా మనోహర్‌ లను సంకీర్తన పురస్కారాలతో ఘనంగా సత్కరించారు. సంఘం గౌరవ అధ్యక్షులు గుమ్మడి జనార్దన్‌, ప్రధాన కార్యదర్శి ఎం.ఎస్‌.నవీన్‌కుమార్‌ పాల్గొన్నారు.

Related Posts