YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

నిమజ్జనం ఏర్పాట్లు షురూ..

నిమజ్జనం ఏర్పాట్లు షురూ..
వినాయక చవితి పర్వదినం సమీపిస్తుండటంతో, నిమజ్జనాన్ని దృష్టిలో విస్త్రృత ఏర్పాట్లు చేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ దాన కిషోర్ బల్దియాలోని వివిధ విభాగాధిపతులను ఆదేశించారు. ఏర్పాట్లకు సంబంధించి అన్ని శాఖలు వచ్చే నెల 10వ తేదీలోపు పూర్తి చేసుకోవాలని కూడా సూచించారు.  కమిషనర్ బల్దియాలోని వివిధ విభాగాధిపతులు, హైదరాబాద్, సైబరాబాద్ ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసులు, జలమండలి, హెచ్‌ఎండీఏ నీటిపారుదల, రోడ్లు భవనాలు, విద్యుత్ తదితర శాఖల అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్ల ఒకటి, రెండురోజులకోసారి డిప్యూటీ కమిషనర్లు, ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహించుకోవాలని సూచించారు. ఏర్పాట్లకు కావల్సిన సమాచారం మొత్తం తెప్పించుకుని, నిమజ్జనంలో ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా పక్కాగా ఏర్పాట్లు చేయాలని సూచించారు.వచ్చే శనివారం మండప నిర్వాహకులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రధాన కార్యాలయంలో మధ్యాహ్నం మూడు గంటలకు ఈ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు వివరించారు.1వ తేదీన ఉదయం పది గంటలకు తిరిగి అధికారులతో తాను సమావేశం కానున్నట్లు, అంతలోపు నిమజ్జనం ఏర్పాట్లకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని సిద్దం చేసుకోవాలని ఆదేశించారు.గణేష్ నిమజ్జనం జరిగే మార్గాల్లో రోడ్ల మరమ్మతులు, నిర్మాణం తదితరు పనులకు సంబంధించి మందస్తు అనుమతులు తీసుకుని, వెంటనే పనులు ప్రారంభించాలని స్పష్టం చేశారు

Related Posts