YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

చంద్రబాబు పై వారంట్ జారీ

 చంద్రబాబు పై వారంట్ జారీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ నెల 21న చంద్రబాబుతో పాటు మిగతా 14 మందిని కోర్టులో హాజరు పరచాలని ధర్మాబాద్ కోర్టు ఆదేశించింది. 2010లో బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ధర్నా చేసేందుకు వెళ్లిన చంద్రబాబుతో పాటు 14మందిపై కేసు నమోదైంది. ఎనిమిది ఏళ్లుగా ఒక్క నోటీసు కూడా లేకుండా ఒకేసారి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడంపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. తిరుమల శ్రీవారి సేవలో వుండగానే నోటీసులు వచ్చినట్లు చంద్రబాబు తెలుసుకున్నారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఒకే సారి ఏపీ సీయం చంద్రబాబుపై నాన్ బెయిలబుల్ నోటీసులు జారీ చేయడాన్ని తెలుగు దేశం నేతలు తప్పు బడుతున్నారు. చంద్రబాబుపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ కావడంతో ఏపీలో మరోసారి రాజకీయాలు వేడెక్కనున్నాయి. 2010లో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు మహారాష్ట్రలో బాబ్లీ ప్రాజెక్ట్ నిర్మాణం చేపడితే ఉత్తర తెలంగాణ ఎడారిగా మారుతుందని,  ప్రాజెక్ట్ నిర్మాణం నిలిపివేయాలంటూ చంద్రబాబు ఆందోళనకు దిగారు. సుమారు 40 మంది తెలుగుదేశం పార్టీ తో నాయకులతో కలసి తెలంగాణ సరిహద్దు దాటి మహారాష్ట్ర లోకి ప్రవేశించి ఆందోళనకు దిగారు,  అక్కడ ఆందోళనల తో పాటు ఆమరణ నిరాహార దీక్షలు చేపట్టారు.  దాంతో మహారాష్ట్ర పోలీసులు  వారిపై విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేసి గాయపరిచారు. ఆ క్రమంలో పలువురు గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు.. ఆందోళనలు చేస్తున్నారన్న కారణంతో ముఖ్యమంత్రి చంద్రబాబు సహా మరో 14 మందిపై కేసులు నమోదు చేశారు.. అయితే తాను బెయిల్ కూడా తీసుకోనని తనను అరెస్ట్ చేయండి అంటూ చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు..  మహారాష్ట్ర పోలీసులు చంద్రబాబు సహా మిగతా నాయకులను బలవంతంగా విమానం ఎక్కించి హైదరాబాదుకు తరలించారు.. అయితే ఆ వివాదం అంతటితో ముగిసినప్పటికీ చంద్రబాబు పై ఉన్న కేసులు మాత్రం ధర్మబద్ కోర్టులో పెండింగ్ లోనే ఉన్నాయి.. ఈ క్రమంలో గత నాలుగు రోజుల క్రితం మహారాష్ట్రకు చెందిన వ్యక్తి అరెస్ట్ వారెంట్ పెండింగ్ ఉన్నప్పటికీ చంద్రబాబును ఎందుకు అరెస్టు చేయడం లేదంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.. దీంతో ధర్మాబాద్ కోర్టు అరెస్టు వారెంట్ పెండింగ్ లో ఉంటే ఎందుకు చంద్రబాబును అరెస్టు చేయలేదంటూ పోలీసులపై తీవ్ర ఆగ్రహం వేసి ఈ నెల ఇరవై ఒకటో తారీకు న తమ ముందు హాజరు పరచాలంటూ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.. దీంతో ఇటీవల హీరో శివాజీ చెప్పిన నోటీసులు ఈ నోటీసు లేనేమో అని టిడిపి వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది చంద్రబాబు తో పాటు  ప్రస్తుత టిఆర్ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యేలు గంగూల కమలాకర్ (కరీంనగర్), హన్మంత్ షిండే(జుక్కల్), టీడీపీ నేత నామా నాగేశ్వరరావు, ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే సిహెచ్ విజయ రామారావు, కే ఎస్ రత్నం(రంగారెడ్డి), ఆనంద్ బాబు (గుంటూరు), ఏపీ కి చెందిన కేఎస్ ఎన్ రాజు, అబ్దుల్ రసూల్ ఖాన్, ప్రకాష్ గౌడ్, పి.సత్యనారాయణ, సోమోజీ సిహెచ్ ప్రభాకర్, హైదరాబాద్ కు చెందిన ముజాఫరోద్దీన్ ల పై ధర్మాబాద్ లో కేసు నమోదు చేశారు. సుమారు ఎనిమిదేళ్ల గా ఒక్క నోటీసు కూడా ఇవ్వకుండా నేరుగా అరెస్ట్ వారెంట్ జారీ చేయటం ఎంతవరకు సబబు అని టిడిపి నాయకులు ప్రశ్నిస్తున్నారు.. ప్రస్తుతానికి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబును అరెస్టు చేయడం సాంకేతికంగా కుదరనప్పటికీ ఈ అంశంపై న్యాయ నిపుణులు చర్చించి నిర్ణయం తీసుకోనున్నా రు. చంద్రబాబుపై వారెంట్ జారీ కావడంతో ఎపీలో మరోసారి రాజకీయాలు వేడెక్కనున్నాయి.

Related Posts