YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

తెలంగాణ

అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా డబ్బు, మద్యంకు అద్దికట్ట వేయండి - ఈసికి జాతీయ బి.సి సంక్షేమ సంఘం అద్యక్షులు ఆర్.కృష్ణయ్య విజ్ఞప్తి

అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా డబ్బు, మద్యంకు అద్దికట్ట వేయండి - ఈసికి జాతీయ బి.సి సంక్షేమ సంఘం అద్యక్షులు ఆర్.కృష్ణయ్య విజ్ఞప్తి

అసెంబ్లీ ఎన్నికల కోసం గత వారం రోజులుగా రాజకీయ పార్టీలు గ్రామాలలో విచ్చల విడిగా డబ్బులు – మద్యం- విస్కీ, బీరు, బ్రాంది బాటిల్స్ పంచుతున్నారని వీటిని అరికట్టాలని కోరుతూ జాతీయ బి.సి సంక్షేమ సంఘం అద్యక్షులు ఆర్.కృష్ణయ్య నాయకత్వంలో నేడు ఎలక్షన్ కమీషనర్ రజత్ కుమార్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. డిసెంబర్ 7 న తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్నాయి. కాని ఇప్పుడే అన్ని రాజకీయ పార్టీలు కోట్ల రూపాయలు వెదజల్లడం ప్రారంబించాయి. అలాగే మద్యం లాంటి ఇతర ప్రలోభాలు చూపుతున్నారు. ఒక్కొక్క అభ్యర్థి 20 నుంచి 30 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టడానికి రంగం సిద్దం చేస్తున్నారు.

గ్రామంలో కుల పెద్దలకు – గ్రామా పెద్దలకు, యువజన సంఘాలకు లక్ష నుంచి 10 లక్షల వరకు ఇవ్వడానికి బేరసారాలు కుదుర్చుకుంటున్నారు. కొంత అడ్వాన్సు ఇచ్చినట్లు పిర్యాదులు వస్తున్నాయి. అప్పుడే బీరు, విస్కీ, బ్రాంది తదితర మత్తు పదార్థాలను విచ్చల విడిగా పంచుతున్నారు.గ్రామాలలో రాజకీయ పార్టీలు డబ్బులు పంచుతున్నారు. మద్యం సేసాలు, కళ్ళు, సారాయి పంపినిచేస్తున్నారు. దీని మూలంగా ప్రజలు పట్ట పగలు రోజంతా తాగి ఉగుతున్నారు. రోడ్ల మీద పడుతున్నారు. ఆరోగ్యం దెబ్బ తింటున్నాయి. ఎన్నికల పుణ్యమాయని పేద ప్రజల ఆరోగ్యాలు దెబ్బతిని ఆస్పత్రుల పాలవుతున్నారు.    రాజకీయ పార్టీలు దారి తప్పుతున్నాయి. పౌర సమాజం, మేధావులు, సంఘ సంస్కర్తలు, ప్రొఫెసర్లు, ఉపాద్యాయులు, విద్యావంతులు జోక్యం చేసుకొని రాజకీయాలను సంస్కరించడానికి ముందుకు రావలిసిన సమయం ఆసన్నమైంది.

ఎన్నికలలో ధన ప్రవాహం తగ్గించడానికి సమాజంలో అన్ని వర్గాలు ప్రయత్నం చేయాలి. ప్రజలను చైతన్యం చేయవలసి యుంది.రాజకీయ పార్టీలు డబ్బున్న వారికే ప్రాధాన్యత ఇవ్వడం మూలంగా దేశం నాయకత్వ లేమితో రాజకీయ రంగం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంది. ఉద్యమకారులు, సంఘ సేవకులు, మేధావులు సమాజం గురించి, దేశం గురించి ఆలోచించేవారు రాజకీయంలోకి రావడం లేదు. అందుకు కారణం పార్టీలు టికెట్లు ఇవ్వడం లేదు. డబ్బున్న వారికే కోట్ల రూపాయలకు టికెట్లు అమ్ముకుంటున్నారు. రాజకీయాలను వ్యాపారంగా మార్చారు. పార్టీలు కోట్ల రూపాయల సూట్ కేసులు తీసుకొని కాంట్రాక్టర్లకు, వ్యాపారస్తులకు, రియల్టర్లకు, బిల్డర్లకు పారిశ్రామిక వేత్తలకు టికెట్లు అమ్ముకుంటున్నారు

దీనితో రాజకీయాలు వ్యాపారంగా మార్చేశారని పేర్కొన్నారు.ఎలక్షన్ కమీషన్ రాజ్యాంగ బద్దమైన స్వతంత్ర సంస్థ దేశ రాజకీయాలను శాసించే సంస్థ. ఎన్నికల సంస్కరణలు, రాజకీయ సంస్కరణ తీసుకురావలిసిన భాద్యత ఎన్నికల కమీషన్ పై ఉంది. ఎన్నికలు సజావుగా, స్వేఛ్చగా నడుపవలిసిన భాద్యత కమీషన్ పై ఉందన్నారు.ఎలక్షన్లు జరిగే డిసెంబర్ 7 వరకు వెంటనే బీరు షాపులు, బార్లు ముసివేయాలని,ఎన్నికలలో ధన ప్రవాహం అరికట్టడానికి విస్త్రుతమైన కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. పోలీసు నిఘా ఏర్పాటు చేయాలనిప్రతి గ్రామంలో సి.సి కెమరాలు పెట్టి గట్టి నిఘా ఏర్పాటు చేయాలి. సి.ఐ.డి నిఘా ఏర్పాటు చేయాలని,డబ్బు ఇవ్వడానికి ప్రయత్నం చేసే నాయకులను, పార్టీ అభ్యర్థుల పై గట్టి నిఘా ఏర్పాటు చేయాలి. డబ్బులు పంచుతూ దొరికితే ఎలక్షన్ నుండి డిబార్ చేయాలి. పంచిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టి 6 నెలల జైలు శిక్ష పడేటట్లు చర్యలు తీసుకోవాలని కోరారు.

Related Posts