YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

కాపీ వివాదంలో '96' చిత్రం..!!

కాపీ వివాదంలో  '96'  చిత్రం..!!

 విజయ్ సేతుపతి, త్రిష జంటగా వచ్చిన తమిళ సినిమా '96' మంచి విజయం సాధించింది. ఈ చిత్రం చుట్టూ కాపీ వివాదం ముసురుకుంటోంది.  ఈ చిత్రానికి ప్రేమ్ కుమార్  దర్శకత్వం వహించాడు. దర్శకుడు భారతీరాజా మాట్లాడుతూ, 'నా అసిస్టెంట్ సురేశ్ రాసుకున్న కథ ఇది. ఈ కథ మరుధ పాండియన్ అనే వ్యక్తి ద్వారా ప్రేమ్ కుమార్ కి వెళ్లింది. గతంలో సురేశ్ కి స్నేహితుడిగా వున్న మరుధ పాండియన్ మోసం చేశాడు' అన్నారు. ఈ విషయంపై ప్రేమ్ కుమార్ స్పందిస్తూ .. 'ఈ ఆరోపణల్లో ఎంతమాత్రం వాస్తవం లేదు. అందరి జీవితాల్లో కామన్ గా జరిగే సంఘటనలతో ఈ కథను రూపొందించాను. ఈ సినిమా హిట్ కావడం వలన ఇలా కుట్ర చేస్తున్నారు.

 
 

 

 

Related Posts