YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

‘ప్లాస్టిక్‌పై సమరశంఖం

‘ప్లాస్టిక్‌పై సమరశంఖం

బాటిళ్లపై నిషేధం విధించే దిశగా మహారాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రభుత్వ కార్యాలయాలు, స్టార్‌ హోటళ్లు, విద్యాసంస్థలు, పర్యాకట ప్రాంతాల్లోని హోటళ్లలో ఈ నిషేధం అమలు చేయాలని భావిస్తోంది. ఈ మేరకు డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ను సిద్ధం చేసిన దేవేంద్ర ఫడవ్నిస్‌ ప్రభుత్వం త్వరలో దానిని కేబినెట్‌ ముందుకు తీసుకురానుంది.

‘ప్లాస్టిక్‌ పెట్‌ బాటిళ్ల అమ్మకంతోపాటు పర్యావరణానికి హానికరంగా ఉన్న వస్తువుల(ఫ్లాస్టిక్‌ బ్యాగులు, ఫ్లెక్సీ మెటీరియల్‌, బ్యానర్లు తదితరాలు)పై కూడా నిషేధం అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది’ అని అదనపు సీఎస్‌ సతీష్‌ గవై వెల్లడించారు. అయితే దుకాణ సముదాయాల్లో మాత్రం వాటి అమ్మకం యథావిధిగా కొనసాగుతాయని ఆయన స్పష్టత ఇచ్చారు. ఇక రాష్ట్ర ఆదాయంపై గణనీయ ప్రభావం చూపే ఈ నిర్ణయంపై వివిధ విభాగాల అభిప్రాయాన్ని సేకరించే పనిలో ప్రభుత్వం నిమగ్నమయ్యింది.

ఇందుకోసం పర్యావరణ శాఖ అధికారులను రంగంలోకి దించింది. ఓవైపు ఈ నిర్ణయంపై వాటర్‌ బాటిల్‌ కంపెనీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుండగా.. పర్యావరణ ఉద్యమకారులు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు. అని అనుకున్నట్లు జరిగితే మార్చి నుంచే ఈ నిర్ణయం మహారాష్ట్రలో అమలు అయ్యే అవకాశం ఉంది.

Related Posts