YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

నర్సీ పట్నంలో త్రిముఖ పోటీ

నర్సీ పట్నంలో త్రిముఖ పోటీ
నర్సీ పట్నం...మూడు దశాబ్దాలుగా టీడీపీ జెండా రెపరెపలాడుతున్న సీటు ఇది. అంతేనా ఒకే కుటుంబాన్ని ఏళ్ళకు ఏళ్ళుగా జనం ఆదరిస్తున్న ప్రాంతం కూడా ఇదే. ఎన్నో మార్లు మంత్రి పదవి దక్కించుకుని రూరల్ జిల్లాలోనే గుర్తింపు తెచ్చుకున్న నర్సీపట్నం అంటే రాజకీయాలకు అడ్డాగా పేర్కొంటారు. ఇక్కడ నుంచి వచ్చే ఎన్నికల్లో కూడా మరో మారు అయ్యన్నపాత్రుడు పోటీకి తయారవుతున్నారు. మరి ఆయన ప్రత్యర్ధుల మాటేమిటి అంటే చాలా మందే రేసులో కనిపిస్తున్నారు.ఇక్కడ ప్రధాన ప్రతిపక్షంగా వైసీపీ ఉంది. ఆ పార్టీ తరఫున వచ్చే ఎన్నికల్లో మరో మారు పోటీ చేసేందుకు పెట్ల ఉమా శంకర్ రెడీ అవుతున్నారు. 2014 ఎన్నికల్లో అయ్యన్ననే సవాల్ చేసి మరీ కేవలం రెండు వేల ఓట్ల తేడాతో ఓడిపోయిన ఉమా శంకర్ ఈసారి పాత బాకీ తీర్చుకోవాలని చూస్తున్నారు. ఇప్పటికే అనేక పోరాటాలు చేస్తూ జనంలో ఉంటున్న ఆయనకు పార్టీలోనే మరో వర్గం ఏ మాత్రం సహకరించడంలేదు. గత ఎన్నికల ముందు వైసీపీలో చేరిన బోళెం ముత్యాలపాప అప్పట్లో పరోక్షంగా అయ్యన్న గెలుపునకు సహకరించారని అంటారు. అందుకే రాత్రికి రాత్రే ఫలితం తారు మారై స్వల్ప తేడాతో ఉమా శంకర్ ఓడిపోయారని చెబుతారు. ఫలితంగా వైసీపీలో ఏర్ప‌డిన రెండు వర్గాలు ఇప్పటికీ గ్రూపులుగానే ఉన్నాయి. ఇపుడు కొత్తగా జనసేన రావడంతో ముత్యాల పాప ఆ పార్టీ వైపుగా చూస్తున్నట్లుగా తెలుస్తోందిముత్యాల పాప కనుక జన సేనలో చేరితే నర్శీపట్నంలో త్రిముఖ పోరు తప్పదంటున్నారు. మాజీ ఎమ్మెల్యేగా ఆమెకు ఉన్న బలానికి తోడు, పవన్ చరిష్మా, జనసేన ఫ్యాన్స్ కలిస్తే రెండు ప్రధాన పార్టీలకూ గట్టి పోటే ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. వైసీపీ నుంచి ఆమె వెళ్ళిపోతే ఎవరికి చేటు అన్నదానిపైన కూడా అంచనాలు వేరు వేరుగా ఉన్నాయి. ఆమె వైసీపీ నుంచి వెళ్తారు కాబట్టి ఆ పార్టీకే దెబ్బ, టీడీపీ ఈ పోరులో సులువుగా నెగ్గుకువస్తుందని పసుపు పార్టీ శిబిరం అంచనా వేస్తోంది. ఓట్లు చీలిపోయి వైసీపీ మరో మారు పరాభవం చవి చూస్తుందని కూడా అంటున్నారు.అయితే వైసీపీ లెక్క వేరుగా ఉంది. ఆమె తమ పార్టీలో ఉన్నా గత ఎన్నికల్లొ టీడీపీకి సహాయం చేశారని, ఆ విధంగా చూసుకుంటే అది టీడీపీకే మైనస్ కావాలని లాజిక్ పాయింట్ తీస్తోంది. అంతే కాదు, గత ఎన్నికల్లో టీడీపీకి సపోర్ట్ చేసిన పవన్ ఫ్యాన్స్ ఇపుడు జన సేనకు ఓట్లు వేస్తారని ఆ విధంగా కూడా టీడీపీ నష్టపోతుందని చెబుతున్నారు. మొత్తానికి ఇక్కడ జనసేన కాళ్ళూనుకునేందుకు ఈ మాజీ ఎమ్మెల్యే పోటీ ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి.

Related Posts