YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

దేశీయం

వివాదస్పద వ్యాఖ్యలు చేసిన కాశ్మిర్ సీఎం

వివాదస్పద వ్యాఖ్యలు చేసిన కాశ్మిర్ సీఎం

 -  ఫరూక్ అబ్దుల్లా వాదనతో గొంతు కలిపిన ముఫ్తీ

-  బీజేపీకి మింగుడుపడని వైనం 

మొన్న పటాన్‌కోఠ్, నిన్న సంజువాన్ ఆర్మీ క్యాంప్, ఇవాళ శ్రీనగర్ సీఆర్‌పీఎఫ్ క్యాంపుపై పాక్ ఉగ్రమూకలు ఉన్మాద దాడులకు పాల్పడుతూ భారత జవాన్లను పొట్టనపెట్టుకుంటున్న తరుణంలో జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ సోమవారంనాడు అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష నేత ఫరూక్ అబ్దుల్లా బాటలోనే ఆమె కూడా పాక్‌తో చర్యలే ఇప్పటికే మనముందున్న పరిష్కారం అంటూ వ్యాఖ్యానించారు. ఆమె వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. ఓవైపు వీర జవాన్లు దేశం కోసం ప్రాణాలర్పిస్తుంటే పాక్ ఉగ్రచర్యలను ఖండించాల్సిన ముఖ్యమంత్రి సైనికుల మనోస్థైర్యాన్ని నీరుగార్చే ప్రయత్నం చేయడమేంటంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

గత శనివారం సంజువాన్ ఆర్మీ క్యాంప్‌పై జరిగిన ఉగ్రదాడి నుంచి కోలుకోకముందే శ్రీనగర్‌లో సీఆర్‌పీఎఫ్ ఉగ్రవాదులు సోమవారం తెల్లవారుజామున తెగబడ్డారు. ప్రస్తుతం ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. ఈ పరిణామాలపై అసెంబ్లీలో మెహబూబూ ముఫ్తీ మాట్లాడుతూ, పాకిస్థాన్‌తో మనం చేసిన అన్ని యుద్ధాల్లోనూ గెలుపు సాధించామని, అయితే మన జవాన్లు, పౌరులు మరణిస్తూ పోతున్న ఇవాల్టి తరుణంలో చర్చలు మినహా మరో పరిష్కారం లేదని ఆమె కుండబద్ధలు కొట్టారు. తాము చర్చలు (పాకిస్థాన్‌తో) గురించి మాట్లాడుతుంటే తమపై జాతివ్యతిరేకులంటూ కొన్ని మీడియా సంస్థలు ముద్రవేస్తుండటం దురదృష్టకరమని ఆమె అన్నారు. సమస్యకు చర్చలే పరిష్కారమంటూ పదేపదే చెబుతున్న ఫరూక్ అబ్దుల్లా వాదనతో మెహబూబా ముఫ్తీ తాజాగా గొంతుకలపడం ముఫ్తీ సర్కార్‌లో భాగస్వామిగా ఉన్న బీజేపీకి సైతం మింగుడుపడటం లేదు.

Related Posts