
న్యూఢిల్లీ,
మోదీ రికార్డు 17 విదేశీ పార్లమెంట్లలో ప్రసంగం ఎక్కువ విదేశీ పార్లమెంట్లలో మాట్లాడిన భారత ప్రధానిగా మోదీ రికార్డు సృష్టించారు. ఇప్పటివరకు 17 విదేశీ పార్లమెంట్లలో ప్రసంగించారు. తాజాగా ఘానా, ట్రినిడాడ్, నమీబియా పార్లమెంట్లలో మాట్లాడారు. గతంలో ఆస్ట్రేలియా, ఫిజీ,భూటాన్, నేపాల్, బ్రిటన్, శ్రీలంక, మంగోలియా, అఫ్గానిస్తాన్, మారిషన్ పార్లమెంట్లలో ప్రసంగించారు. 2016, 2023లో అమెరికా కాంగ్రెస్‌లో ఆ తర్వాత ఉగాండా, మాల్దీవులు, గయానాలో ప్రసంగించి మోదీ రికార్డు సృష్టించారు.